America: ప్రస్తుతం డబ్బు ప్రపంచాన్ని శాసిస్తోంది. దాని కోసం రక్త సంబంధాలను కూడా మర్చిపోతున్నారు. అలాంటిదే ఓ కూతురు తన తల్లిని డబ్బు కోసం చంపిన ఉదంతం అమెరికా నుంచి వెలుగులోకి వచ్చింది. తల్లి ఎంతో గౌరవంగా పెంచిన కూతురు. బయటి ప్రపంచంలో జరుగుతున్న విషయాలు తనపై ప్రభావం చూపనివ్వలేదు.. కానీ డబ్బు కోసం.. ఈ కుమార్తె తన స్వంత తల్లి ప్రాణాలను తీసి మృతదేహాన్ని సూట్‌కేస్‌లో నింపింది. అగ్ర రాజ్యం అమెరికా నుంచి ఇటీవల కాలంలో గుండెలు పిండేసే హత్య కేసులు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. అలాంటిదే మరో కేసు వెలుగులోకి వచ్చింది. ఒక సంపన్న మహిళ షీలా వాన్ వైస్-మాక్ దారుణంగా హత్యకు గురయింది. ఆమెను తన సొంత కూతురే తన ప్రియుడితో కలిసి దారుణంగా హత్యచేసింది. ఈ కేసులో 28 ఏళ్ల హీథర్ మాక్‌కు 26 ఏళ్ల జైలు శిక్ష పడింది.
Read Also:Dhanush Nagarjuna: పాన్ ఇండియా సినిమా మొదలుపెట్టిన శేఖర్ కమ్ముల…
అమెరికాలో నివాసం ఉంటున్న 28 ఏళ్ల హీథర్ మాక్ తన ప్రేమికుడితో కలిసి తన సొంత తల్లిని హత్య చేసి తన మృతదేహాన్ని సూట్‌కేస్‌లో కుక్కింది. హత్య చేసినప్పుడు మాక్ వయస్సు 18 సంవత్సరాలు.. తాను అప్పటికే గర్భవతి అని దర్యాప్తులో తేలింది. మాక్ ఆమె ప్రేమికుడు టామీ స్కేఫర్‌తో కలిసి 1.5మిలియన్ డాలర్ల ట్రస్ట్ ఫండ్ కోసం తన తల్లిని చంపింది. మొదట మాక్ తన తల్లిని నోటికి గుడ్డ కట్టింది.. తర్వాత ఆమో ప్రియుడు టామీ స్కేఫర్ తలపై కొట్టాడు. తల్లిని హత్య చేసిన తర్వాత మాక్ , ఆమె ప్రేమికుడు మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పెట్టి టాక్సీలో వదిలి వెళ్లారు. సూట్‌కేస్‌లో మృతదేహం అవశేషాలను పోలీసులు గుర్తించారు.
Read Also:Kodali Nani: పనికి రాని వాళ్లనే సీఎం పక్కన పెట్టారు.. ప్రతిసారీ అదే నేతలకు టిక్కెట్లివ్వాలా..?
2014లో బాలిలో జరిగిన ఈ ఘటనలో దోషిగా తేలిన తర్వాత, హీథర్ తన తల్లిని చంపడంతో సాయం చేసినందుకు 26 ఏళ్ల జైలు శిక్షార్హురాలైంది. హీథర్ 2015లో ఇండోనేషియాలో దోషిగా నిర్ధారించబడింది. పదేళ్ల జైలు శిక్ష విధించబడింది, కానీ 2021లో విడుదలైంది. మాక్ గత రెండు సంవత్సరాలుగా శిక్ష నిమిత్తం చికాగో జైలులో గడిపారు. న్యాయమూర్తి మాథ్యూ కెన్నెల్లీ 28 ఏళ్ల మాక్‌కు అధికారిక శిక్షను సుమారు 23 సంవత్సరాలు తగ్గిస్తూ తీర్పు చెప్పారు. మాక్ ప్రేమికుడు టామీ స్కేఫర్ ఇండోనేషియా జైలులో ఖైదు చేయబడ్డాడు.