ఫంగల్ తుఫాను ఇప్పటికీ సముద్ర తీర ప్రాంతాల్లో స్థిరంగా ఉంది. క్రమంగా బలహీనపడుతుందని భావిస్తున్నారు. అయితే తుఫాను తమిళనాడులోని విల్లుపురం, పుదుచ్చేరిలో భారీ వర్షాలకు కారణమైంది. దీని కారణంగా.. చైన్నై నగరంలో ఇండిగో విమానం తృటిలో క్రాష్ ల్యాండింగ్ను నుంచి తప్పించుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. ల్యాండింగ్ సమయంలో విమానం నేలను ఢీకొట్టేందుకు యత్నించింది.
పుదుచ్చేరి, తమిళనాడులోని స్కూల్స్, కాలేజీలు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. చెన్నై, కడలూరు, విల్లుపురం, కళ్లకురిచ్చి, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువళ్లూరు, మైలాడుతురై జిల్లాల్లో ఈ రోజు మూతపడ్డాయి.
Shamshabad: కొద్దిరోజులుగా విమానాలకు వరుస బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. గత 21 రోజుల్లో 510కిపైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తాజాగా మూడు ఇండిగో విమానాలు,
భారతీయ విమానయాన సంస్థలకు గత 14 రోజులుగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. ఈరోజు.. ఆదివారం (అక్టోబర్ 27న) ప్రయాణికులతో నిండిన కనీసం 50 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇన్ని బెదిరింపు కాల్స్ రావడంతో.. ఇది విదేశీ కుట్రనా.. లేక నిజంగానే ఎవరైనా కావాలనే చేస్తున్నారా? అన్నది తెలుసుకోవడం కష్టమవుతోంది.
కడప ఎయిర్పోర్టులో కడప - హైదరాబాద్ ఇండిగో కనెక్టింగ్ విమాన సర్వీసును రాష్ట్ర రవాణా శాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యేలు పుట్టా సుధాకర్ యాదవ్, చైతన్య రెడ్డితో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఏడాదిగా కడప-హైదారాబాద్ విమాన సర్వీసులు లేవని.. ఎన్నో సార్లు లేఖలు రాసినా ప్రయోజనం లేదన్నారు.
విజయవాడ-విశాఖ మధ్య ఎయిరిండియా, ఇండిగో విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. విశాఖ ఎయిర్పోర్టులో విమాన సర్వీసులను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఇండిగో విమాన ప్రయాణికులకు కేంద్ర మంత్రి బోర్డింగ్ పోసులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భోగాపురంలో అంతర్జాతీయ స్థాయి ఎయిర్ సర్వీసెస్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామన్నారు
Bomb Threats To Flights: గత 10 రోజలుగా భారత విమానయాన రంగాన్ని నకిలీ బాంబు కాల్స్, మెసేజులు కలవరపెడుతున్నాయి. ఈ నకిలీ బెదిరింపుల వల్ల ప్రయాణికులు, అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా గురువారం కూడా నకిలీ బాంబు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. ఎయిరిండియా, విస్తారా, ఇండిగోలకు చెందిన 60 విమానాలకు, ఆకాసా ఎయిర్కి చెందిన 14 విమానాలకు బెదిరింపులు వచ్చినట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి.
Flight Bomb Threats: గత కొన్ని రోజులుగా భారతదేశ విమానయాన రంగం తీవ్ర బెదిరింపుల్ని ఎదుర్కొంటోంది. ఎయిర్ ఇండియా, ఇండిగో, ఆకాశ, విస్తారా ఇలా అన్ని సంస్థలకు చెందిన విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు వచ్చాయి. గత వారం నుంచి ఏకంగా 100కు పైగా విమానాలు బెదిరింపులు ఎదుర్కోన్నాయి. వీటిలో అంతర్జాతీయ, దేశీయ విమానాలు ఉన్నాయి.అయితే, వీటిలో చాలా వరకు బెదిరింపులు ఎక్స్(ట్విట్టర్) ఖాతాల నుంచి వచ్చినవే.
Bomb threats: వరసగా బాంబు నకిలీ బాంబు బెదిరింపులు భారత విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ వారం ప్రారంభం నుంచి 70కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తాజాగా ఈ రోజు మరో 6 ఇండిగో విమానాలు కూడా ఇదే తరహా బెదిరింపుల్ని ఎదుర్కొన్నాయి.
Hoax Bomb Threats: వరసగా నకిలీ బాంబు బెదిరింపులు ఇండియా విమానయాన రంగాన్ని కుదిపేస్తున్నాయి. భారత విమానయాన రంగాన్ని నష్టాల్లోకి నెడుతోంది. ఇప్పటికే ఈ నకలీ బెదిరింపుల వల్ల ఏయిర్లైన్ సంస్థలు కోట్లలో నష్టాలను చవిచూశాయి. అయితే, ఈ బెదిరింపులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. కొన్ని బెదిరింపులు లండర్, జర్మనీ నుంచి వచ్చాయని తెలుస్తోంది. కావాలనే భారత విమానాలను టార్గెట్ చేస్తు్న్నారా..? అనే అనుమానాలు కలుగుతున్నాయి.