Indigo Crisis: విమాన ఛార్జీలపై కేంద్రం కొరడా.. సంక్షోభాన్ని క్యాష్ చేసుకుంటే చర్యల తప్పవని హెచ్చరిక
- విమాన ఛార్జీలపై కేంద్ర విమానయాన శాఖ వార్నింగ్
- సంక్షోభాన్ని క్యాష్ చేసుకుంటే చర్యల తప్పవని హెచ్చరిక
- పరిస్థితులు చక్కబడే వరకూ సాధారణ ఛార్జీలు వసూలు చేయాలని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విమాన ప్రయాణాల్లో 20 ఏళ్లలో ఎన్నడూ లేని సంక్షోభం భారత్ ఎదుర్కొంటోంది. గత ఐదు రోజులుగా ప్రయాణికులు పడుతున్నట్లు ఇబ్బందులు వర్ణనాతీతం. మునుపెన్నడూ లేని కష్టాలు ప్రయాణికులు పడుతున్నారు. ఎలాంటి సమాచారం లేకుండానే ఇండిగో ఎయిర్‌లైన్స్ సర్వీసులు నిలిపేసింది. దీంతో అత్యవసర ప్రయాణాలు ఉన్నవాళ్లంతా దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. లోపలికి వెళ్లి పోయిన బ్యాగ్‌లు వెనక్కి రాక.. ఇటు ఇంటికి తిరిగి వెళ్లలేక ప్రయాణికులు పడుతున్న బాధలు వర్ణించలేం. ఐదు రోజులుగా ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు.
ఇది కూడా చదవండి: Bengal: వెనక్కి తగ్గని సస్పెన్షన్ ముస్లిం ఎమ్మెల్యే.. బాబ్రీ మసీదు శంకుస్థాపనకు భారీ ఏర్పాట్లు
Also Read
- Inidia-Pakistn: భారత యుద్ధ నౌకను ఢీకొట్టిన పాకిస్తాన్ యుద్ధ నౌక.. ‘‘సిందూర్’’ తర్వాత మరో ఘటన..
- UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
- UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
- Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
ఇంకోవైపు ప్రత్యామ్నాయంగా వేరే ఎయిర్‌లైన్స్‌కు మొగ్గు చూపుతున్న తరుణంలో విమాన ఛార్జీలు చూసి గుండె ఆగినంత పనవుతోంది. ఇండిగోలో తలెత్తిన సంక్షోభాన్ని క్యాష్ చేసుకునేందుకు ఇతర విమాన సంస్థలన్నీ ఒక్కసారిగా ధరలు పెంచేశాయి. ఆస్తులు అమ్ముకునేలా ధరలు పెంచేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Indigo: ఇండిగో సిబ్బందిపై విదేశీ మహిళ ఆగ్రహావేశాలు.. వీడియో వైరల్
తాజాగా కేంద్ర విమానయాన శాఖ అప్రమత్తం అయింది. అధిక ఛార్జీలతో ప్రయాణికులను దోచుకునేందుకు ప్రయత్నిస్తున్న విమాన సంస్థలపై కొరడా ఝుళిపించింది. ఇండిగో సంక్షోభాన్ని క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చిది. సాధారణ ఛార్జీలే వసూలు చేయాలని ఆదేశించింది.
నిర్దేశించిన ఛార్జీల పరిమితులను కచ్చితంగా పాటించాల్సిందేనని ఆదేశించింది. పరిస్థితులు చక్కబడే వరకూ ఆదేశాలు అమల్లో ఉంటాయని పేర్కొంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు, రోగులు, అత్యవసరంగా ప్రయాణించే ప్రయాణికులకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని కోరింది. ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు ఛార్జీలను నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉంటామని.. ఎట్టి పరిస్థితుల్లో ప్రస్తుత పరిస్థితిని క్యాష్ చేసుకోవద్దని విమానయాన శాఖ హెచ్చరించింది. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది.
.@MoCA_GoI Action on IndiGo Operational Crisis – Air Fare Regulation
💠 The Ministry of Civil Aviation has taken serious note of concerns regarding unusually high airfares being charged by certain airlines during the ongoing disruption. In order to protect passengers from any…
— PIB India (@PIB_India) December 6, 2025
తాజావార్తలు
-
Inidia-Pakistn: భారత యుద్ధ నౌకను ఢీకొట్టిన పాకిస్తాన్ యుద్ధ నౌక.. ‘‘సిందూర్’’ తర్వాత మరో ఘటన..
-
Rapido ఆగడాలకు బ్రేక్.. ఏకంగా రూ.10 లక్షల ఫైన్! అసలేం జరిగిందంటే?
-
CM Revanth Reddy: కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడానికి కారణం ఇదే.. సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తిక వ్యాఖ్యలు..
-
Hanuman Ansh : త్రివిక్రమ్ ఔట్, సెన్సార్ బ్రేక్.. ఆగిపోయిన ‘హనుమాన్ అన్ష్’!
-
US: బస్సు ప్రమాదాన్ని కవర్ చేస్తూ కూలిన మీడియా హెలికాప్టర్.. ముగ్గురు మృతి
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!