చెన్నై ఎయిర్‌పోర్టులో అర్ధరాత్రి హై టెన్షన్ నెలకొంది. టేకాఫ్ అయిన విమానంలో ఇద్దరు ప్రయాణికులు తమ వద్ద బాంబు ఉందని, పేల్చేవేస్తామంటూ బెదిరించారు. దాంతో విమానంలో ఏం జరుగుతుందో తెలియక తోటి ప్రయాణికులు భయంతో వణికిపొయారు. చెన్నై ఎయిర్‌పోర్టులో విమానాశ్రయం ల్యాండ్ అయిన వెంటనే అధికారులు తనిఖీలు చేసి బాంబులేదని నిర్ధారించారు. ఇద్దరు ప్రయాణికులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
శనివారం అర్ధరాత్రి కొచ్చి నుంచి చెన్నైకి 171 మంది ప్రయాణికులతో ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్యాసింజర్ విమానం బయల్దేరింది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే అమెరికా ,కేరళకు చెందిన ఇద్దరు ప్రయాణికుల మద్య గోడవ జరిగింది. ఇద్దరు పరస్పరం దాడులు చేసుకున్నారు. తమ దగ్గర బాంబు ఉందని, పేల్చేవేస్తామంటూ హెచ్చరించారు. ఏం జరుగుతుందో తెలియక తోటి ప్రయాణికులు భయంతో వణికిపోయారు.
పైలెట్లు చెన్నైలో భద్రత అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ వచ్చిన సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. చెన్నై ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్ అయిన వెంటనే అధికారులు తనికీలు చేశారు. తెల్లవారుజామున ఐదు గంటలకు వరకు తనిఖీలు చేసి బాంబు లేదని అధికారులు నిర్ధారించారు. పరస్పరం కొట్టుకుని ప్రయాణికులను బాంబు అంటూ భయభ్రాంతులకు గురిచేసిన ఇద్దరిని పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు.