Indigo : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గందరగోళం
- శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గందరగోళం
- ఇండిగో విమానాల్లో తలెత్తిన సాంకేతిక లోపం
- ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ వెళ్లాల్సి ఉన్న ఇండిగో ఫైట్లు
- నిన్నటి నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల పడిగాపులు
- సమాధానం చెప్పలేని స్థితిలో ఇండిగో ఉద్యోగులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indigo : శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో ఫ్లైట్‌లకు సాంకేతిక లోపాలు ఏర్పడటంతో భారీ గందరగోళం చోటుచేసుకుంది. ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాలకు బయలుదేరాల్సిన విమానాలు వరుసగా ఆలస్యమవడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
Fake Birth Certificate Scam: దేశవ్యాప్త నకిలీ జనన ధ్రువీకరణ పత్రాలకు అడ్డాగా ఏపీలోని ఆ మండలం..
Also Read
చాలా మందిప్రయాణికులు నిన్నటి నుంచి ఎయిర్‌పోర్ట్‌లోనే వేచి చూస్తూ ఇబ్బందులు పడుతున్నారు. ఫ్లైట్‌ల ఆలస్యం గురించి సరైన వివరణ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడటంతో ఇండిగో సిబ్బంది ప్రయాణికుల ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో కష్టాలు ఎదుర్కొంటున్నారు. తెల్లవారుజామున 2 గంటలకు బెంగళూరు వెళ్లాల్సిన ఒక ఇండిగో ఫ్లైట్‌ను రన్‌వేపై రెండు గంటల పాటు నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. చివరికి వారిని తిరిగి విమానం నుంచి కిందకు దింపి టెర్మినల్‌లో ఉంచగా, ప్రయాణికుల అసహనం మరింత పెరిగింది.
ఈ గందరగోళంలో అత్యంత ఇబ్బందులకు గురవుతున్న వారు కనెక్టింగ్ విమానాలు మిస్ అయిన విదేశీ ప్రయాణికులు, వీసా ఇంటర్వ్యూల కోసం వివిధ రాష్ట్రాలకు వెళ్లాల్సిన వారు. ఫ్లైట్ ఆలస్యాలపై స్పష్టమైన సమాచారం అందకపోవడంతో, కొందరు ప్రయాణికులు ఇండిగో ఉద్యోగులతో వాగ్వాదానికి దిగారు. ఇండిగో ఫ్లైట్‌ల సాంకేతిక సమస్యలు ఎప్పుడు పరిష్కరించబడతాయన్నదానిపై ఇంకా స్పష్టత లేని పరిస్థితి నెలకొంది. ఇంతలో, విమానాశ్రయం అధికారులు పరిస్థితిని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నా, ప్రయాణికుల అసహనం మాత్రం తగ్గడం లేదు.
Shocking : చాంద్రాయణగుట్టలో కలకలం.. ఓ ఆటోలో ఇద్దరు యువకుల మృతదేహాలు
తాజావార్తలు
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
-
OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!