Gannavaram to Singapore: గన్నవరం నుంచి సింగపూర్‌కు విమాన సర్వీసులు.. ఐదేళ్ల తర్వాత తిరిగి ప్రారంభించిన ఇండిగో..
- గన్నవరం నుంచి సింగపూర్‌కు ఇండిగో సేవలు పునఃప్రారంభం..
- అంతర్జాతీయ విమాన సర్వీసుల విస్తరణలో మరో పురోగతి..
- ఐదేళ్ల విరామం తర్వాత గన్నవరం నుంచి సింగపూర్‌కు ఇండిగో సర్వీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gannavaram to Singapore: గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి సింగపూర్‌కు ఇండిగో సేవలు పునఃప్రారంభం అయ్యాయి.. దీంతో, ఆంధ్రప్రదేశ్‌కు అంతర్జాతీయ విమాన సర్వీసుల విస్తరణలో మరో ముఖ్యమైన పురోగతి సాధించినట్టు అయ్యింది.. ఐదేళ్ల విరామం తర్వాత గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు ఇండిగో విమాన సేవలు మళ్లీ ప్రారంభం అయ్యాయి. ఇకపై viability gap funding లేకుండానే ఇండిగో సంస్థ వారంలో మూడు రోజులు.. అంటే మంగళవారం, గురువారం, శనివారం.. సింగపూర్‌కు రెగ్యులర్ సర్వీసులు నడపనుంది. ఈరోజు ఉదయం 7:30 గంటలకు గన్నవరం నుంచి మొదటి రీ-లాంచ్ ఫ్లైట్ సింగపూర్‌కు బయల్దేరింది..
Read Also: Parakamani Case: పరకామణి కేసులో కీలక సాక్షి మృతి.. హత్యగా కేసు నమోదు చేసిన పోలీసులు..
Also Read
- Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
- CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
- AP Liquor Case: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. సిట్ విచారణకు మాజీ ఐఏఎస్
- Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను విస్తరించేందుకు ప్రయత్నాలు వేగవంతం అయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రిగా ఉన్న రామ్ మోహన్ నాయుడు ప్రత్యేక చొరవతో ఇండిగో సేవలు తిరిగి ప్రారంభం అయ్యాయి. అంతర్జాతీయ కనెక్టివిటీ పెరగడంతో వ్యాపార రంగం, విద్యార్థులు, ఎన్ఆర్‌ఐలు మరియు టూరిజానికి ఇది ఎంతో ప్రయోజనకరంగా మారనుందని విమానాశ్రయ అధికారులు భావిస్తున్నారు. మొత్తంగా ఈ సర్వీసుల పునఃప్రారంభంతో ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయ విమాన కనెక్టివిటీలో మరో కీలక అడుగు ముందుకు వేసినట్టు అయ్యింది..
ఈ విమాన సర్వీసులు ప్రారంభంతో..
* గన్నవరం నుంచి సింగపూర్‌కు డైరెక్ట్ కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చింది..
* ఏపీ నుంచి దక్షిణాసియా దేశాలకు సులభంగా ప్రయాణం చేయవచ్చు..
* ఇది వ్యాపార-ఐటీ రంగాలకు మరింత బలాన్ని చేకూర్చనుంది అని అంచనా వేస్తున్నారు.
* ఎన్ఆర్‌ఐలు, విద్యార్థులకు సమయం కలిసి రావడంతో పాటు.. ఖర్చు కూడా తగ్గిపోనుంది..
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..