IndiGo: ఇండిగో విమానం 16 గంటలు ఆలస్యం..ఎయిర్‌పోర్టులో చిక్కుకున్న ప్రయాణికులు..
- ఇస్తాంబుల్ వెళ్లాల్సిన ఇండిగో ఫ్లైట్ 16 గంటలు ఆలస్యం..
- ముంబై ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయిన ప్రయాణికులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IndiGo: ఇండిగో విమానం ఆలస్యం కావడంతో 100 మంది ప్రయాణికులు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. సాంకేతిక లోపం కారణంగా 16 గంటల ఆలస్యం కావడంతో ఇస్తాంబుల్ వెళ్లే ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ప్రయాణికులకు విమానయాన సంస్థ క్షమాపణలు చెప్పింది.
Read Also: Rahul Gandhi: మన్మోహన్ సింగ్‌ని బీజేపీ అవమానించింది.
Also Read
- PM Modi Birthday 2026: ప్రధాని మోడీ పుట్టినరోజు.. దేశవ్యాప్తంగా నేటి నుంచి ‘స్వచ్ఛతా హీ సేవ’ ప్రత్యేక కార్యక్రమాలు
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
ఇస్తాంబుల్‌కి ఉదయం 6.55 గంటలకు బయలుదేరాల్సిన ఫ్లైట్ 6E17 ఇప్పుడు రాత్రి 11 గంటలకు బయలుదేరుతుందని ఎయిర్‌లైన్స్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ‘‘మా ఫ్లైట్ 6E17, వాస్తవానికి ముంబై నుండి ఇస్తాంబుల్‌కి నడపాల్సి ఉంది, సాంకేతిక సమస్యల కారణంగా ఆలస్యమైనందుకు మేము చింతిస్తున్నాము. దురదృష్టవశాత్తు, సమస్యను సరిదిద్దడానికి, గమ్యస్థానానికి పంపించడానికి మేము ఎంత ప్రయత్నించినప్పటికీ, చివరికి మేము విమానాన్ని రద్దు చేయవలసి వచ్చింది’’ అని ఇండిగో చెప్పింది. ప్రత్యామ్నాయ విమానాన్ని రాత్రి 11 గంటలకు ఏర్పాటు చేసినట్లు చెప్పింది.
చాలా మంది ప్రయాణికులు ఈ ఆలస్యం వల్ల ప్రభావితమయ్యారు. ఇండిగోకి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. రీఫండ్, ఆల్టర్‌నేట్ విమానం ఏర్పాటు చేయాలని కోరారు. కొందరు సోషల్ మీడియాలో ఇండిగోని నిందించారు. సిబ్బంది మొరటుగా ప్రవర్తించారని, రీషెడ్యూల్, రీఫండ్ గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ప్రయాణికులు ఆరోపించారు. సచిన్ చింతల్వాడ్ అనే యూజర్.. ఈ ఆలస్యం కారణంగా ఇస్తాంబుల్ నుంచి వాషింగ్టన్‌కి వెళ్లే కనెక్టింగ్ ఫ్లైట్‌ని మిస్సయ్యే అవకాశం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
UK SPLIT : బ్రిటీష్ సామ్రాజ్యం ముక్కలవబోతోందా?
-
PM Modi Birthday 2026: ప్రధాని మోడీ పుట్టినరోజు.. దేశవ్యాప్తంగా నేటి నుంచి ‘స్వచ్ఛతా హీ సేవ’ ప్రత్యేక కార్యక్రమాలు
-
Afghanistan: ఆఫ్ఘాన్‌లో అమ్మాయిగా పుట్టడమే శాపమా?
-
Russia Sanctions Bill: రష్యా నుంచి చమురు కొంటే భారత్‌పై 100% టారిఫ్‌లు? అమెరికా హౌస్‌లో కీలక బిల్లు పాస్
-
Astrology: సెప్టెంబర్ 17 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధన లాభం..!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!