దేశ వ్యాప్తంగా నెలకొన్న ఇండిగో సంక్షోభంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతటి గందరగోళం ఎందుకు తలెత్తిందంటూ తీవ్రంగా మందలించింది. ఇక ఇండిగో సంక్షోభం సమయంలో ఇతర ఎయిర్‌లైన్స్ సంస్థలు అధిక ఛార్జీలు వసూలు చేసేందుకు ఎలా అనుమతించబడ్డాయని న్యాయస్థానం నిలదీసింది.
గత వారం నుంచి దేశ వ్యాప్తంగా ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. విమానాశ్రయాల్లో ప్రయాణికులు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలిసిందే. తాజాగా ఇండిగో సంక్షోభంపై ప్రధాని మోడీ స్పందించారు.
ఇండిగో సంక్షోభంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక స్టేట్‌మెంట్ జారీ చేసింది. దేశ వ్యాప్తంగా నెలకొన్న ఇండిగో సంక్షోభంపై అత్యవసర విచారణ చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సోమవారం పిటిషన్ విచారణకు రాగా... సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
భారతదేశంలో ఇండిగో ఎయిర్‌లైన్స్ సృష్టించిన సంక్షోభం అంతా ఇంతా కాదు. మా దగ్గర ఆటలు చెల్లవన్నట్టుగా అటు విమానయాన శాఖకు.. ఇటు ప్రయాణికులకు ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ ఓ పాఠం నేర్పించింది. గత వారం రోజులుగా ప్రయాణికులు విమానాశ్రయాల్లో నరక యాతన పడుతున్నారు.
దేశ వ్యాప్తంగా ఇండిగో సంక్షోభం ఇంకా కొనసాగుతోంది. గత వారం నుంచి విమానాలు నిలిచిపోవడంతో అన్ని విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగిన కూడా పరిస్థితుల్లో మార్పులు కనిపించడం లేదు.
దేశ వ్యాప్తంగా నెలకొన్న ఇండిగో సంక్షోభం అందరికీ తెలిసిందే. గత ఐదు రోజులుగా ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు వర్ణించలేనివి. తిండి తిప్పలు లేకుండా ఎయిర్‌పోర్టుల్లో నరకయాతన పడుతున్నారు. ఇదేం దుస్థితి బాబోయ్ అంటూ గగ్గోలు పెడుతున్నారు.
ఇండిగో ఎయిర్‌లైన్ సంక్షోభం దేశ సర్వోన్నత న్యాయస్థానానికి చేరింది. ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ స్పందించాలని కోరుతూ పిటిషన్ దాఖలైంది.
ఇండిగో ఎయిర్‌లైన్ సృష్టించిన సంక్షోభం అంతా ఇంతా కాదు. మంచి ఫీక్ సమయం చూసుకుని దెబ్బకొట్టింది. సహజంగా డిసెంబర్‌లో ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటిది ఎవరి మీద కోపం.. ప్రయాణికులపై చూపించినట్లైంది.
హమ్మయ్య.. ప్రయాణికులు ఊపిరి పీల్చుకునే శుభవార్త. మూడు రోజులుగా నరకయాతన పడుతున్న ప్రయాణికులకు డీజీసీఏ చెక్ పెట్టింది. నవంబర్ 1 నుంచి విధించిన కొత్త ఆంక్షలను వారం పాటు ఎత్తివేసింది. దీంతో ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో తలెత్తిన సంక్షోభానికి తెర పడినట్లైంది.
ఇండిగోలో తలెత్తిన సంక్షోభం ఇంకా కొనసాగుతోంది. మూడు రోజులుగా విమానాలు రద్దవ్వడంతో ప్రయాణికులు పడుతున్నట్లు పాట్లు అన్నీ ఇన్నీ కావు. మూడు రోజులుగా విమానాశ్రయాల్లోనే ప్యాసింజర్స్ పడిగాపులు కాస్తున్నారు. ఎయిర్‌లైన్స్ నుంచి సరైన సమాధానం లేక ప్రయాణికులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు.