దేశ వ్యాప్తంగా నెలకొన్న ఇండిగో సంక్షోభం అందరికీ తెలిసిందే. గత ఐదు రోజులుగా ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు వర్ణించలేనివి. తిండి తిప్పలు లేకుండా ఎయిర్‌పోర్టుల్లో నరకయాతన పడుతున్నారు. ఇదేం దుస్థితి బాబోయ్ అంటూ గగ్గోలు పెడుతున్నారు. ఇంకొందరైతే సోషల్ మీడియా వేదికగా ఎయిర్‌లైన్ సంస్థ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహావేషాలు వ్యక్తం చేస్తున్నారు. బండ బూతులు తిడుతున్నారు. చెత్త ఎయిర్‌లైన్స్ అంటూ ఎవరికి తోచినట్లుగా దుమ్మెత్తిపోస్తున్నారు. తాజాగా విమానయాన శాఖ రంగంలోకి దిగిన పరిస్థితులు ఇంకా చక్కబడలేదు.
ఇది కూడా చదవండి: Gold Rates: గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు
ఇదిలా ఉంటే ఇండిగో సంక్షోభంపై ప్రముఖ సినీ నటుడు సోను సూద్ ఎక్స్‌లో కీలక పోస్ట్ చేశారు. దయ చేసి నిరాశ చెందిన ప్రయాణికులు.. ఇండిగో సిబ్బందితో మంచిగా వ్యవహరించాలని కోరారు. పై ఆదేశాల ప్రకారం ప్రవర్తించే సిబ్బందిని తిట్టడం ఏ మాత్రం భావ్యం కాదని సూచించారు. ప్రస్తుతం వారంతా నిస్సహాయంగా ఉన్నారని… శక్తిహీనులైన వారి పట్ల మర్యాదగా వ్యవహరించాలని ప్రయాణికులకు సోను సూద్ విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి: Ram Mohan Naidu: ఇండిగో తీరుపై కేంద్రమంత్రి సీరియస్.. చర్యలు ఉంటాయని వార్నింగ్
సిబ్బందితో దూకుడుగా వ్యవహరిస్తున్న తీరు బాధాకరంగా ఉందని పేర్కొన్నారు. తన కుటుంబానికి చెందిన వారు కూడా 5 గంటలు వేచి ఉన్నాకే విమానం వచ్చిందని.. చివరికి గమ్యస్థానానికి చేరుకున్నారని గుర్తుచేశారు. చాలా మంది ప్రయాణికులు వివాహాలకు హాజరు కాలేకపోయారని.. సమావేశాలు.. ముఖ్యమైన పనులు మానుకున్నారని తెలుసు అన్నారు. అయితే సిబ్బంది.. ఎయిర్‌లైన్స్ ఆదేశాలు పాటిస్తారని.. అలాంటిది వారి మీద అరవడం ఏ మాత్రం బాగోలేదని.. ఈ తీరు బాధ కలిగిస్తుందని చెప్పుకొచ్చారు. విమానాలు ఎప్పుడు బయల్దేరతాయో వారికి తెలియదు.. అలాంటప్పుడు వారి మీద ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడం ఎంత వరకు కరెక్ట్ అని సోను సూద్ పేర్కొ్న్నారు. ఎప్పుడూ చిరునవ్వుతో పలకరించే సిబ్బందితో ఇలా వ్యవహారించకండి అని కోరారు. దయ చేసి వారిని గౌరవించండి అని సోను సూద్ వీడియో సందేశంలో వేడుకున్నారు.
"A delayed flight is frustrating, but remember the faces trying to fix it. Please be nice and humble to the IndiGo staff; they are carrying the weight of cancellations too. Let’s support them." @IndiGo6E pic.twitter.com/rd3ciyekcS
— sonu sood (@SonuSood) December 6, 2025