భారతదేశంలో ఇండిగో ఎయిర్‌లైన్స్ సృష్టించిన సంక్షోభం అంతా ఇంతా కాదు. మా దగ్గర ఆటలు చెల్లవన్నట్టుగా అటు విమానయాన శాఖకు.. ఇటు ప్రయాణికులకు ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ ఓ పాఠం నేర్పించింది. గత వారం రోజులుగా ప్రయాణికులు విమానాశ్రయాల్లో నరక యాతన పడుతున్నారు. తిండి తిప్పలు లేకుండా పడిగాపులు కాస్తున్నారు. మీడియా ఛానల్స్‌లో… సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు.. ఎన్నో ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రయాణికులు ఆక్రోషం, ఆక్రందనలు చేస్తున్నా కూడా ఇండిగోకు చీమ కుట్టినట్లైనా లేదు. నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. ఇంత సంక్షోభం కళ్ల ముందు కనిపిస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చేయలక చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. ప్రస్తుత సంక్షోభాన్ని గాడిన పెట్టే పరిస్థితులు ఏం కనిపించడం లేదు. గత వారం మొదలైన సంక్షోభం.. ఈ వారం కూడా కొనసాగుతూనే ఉంది. సోమవారం కూడా వందలాది విమానాలను రద్దు చేసింది. దీంతో ప్రయాణికుల ఇక్కట్లు కొనసాగుతూనే ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Gold Rates: గోల్డ్ లవర్స్‌కు మళ్లీ షాక్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
ఇదిలా ఉంటే దేశ వ్యాప్తంగా ఏ ఎయిర్‌పోర్టుల్లో చూసినా ప్రయాణికులు, లగేజీ బ్యాగులతో కిటకిటలాడుతున్నాయి. అన్ని విమానాశ్రయాలు డంప్ యార్డులను తలపిస్తున్నాయి. ఎటు చూసినా బ్యాగులు కనిపిస్తున్నాయి. కుప్పలు తిప్పలుగా పడిపోయి ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇంకోవైపు చోరీలు కూడా జరుగుతున్నాయి. తమ వస్తువులు పోయాయంటూ ప్రయాణికులు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇదిలా ఉంటే విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ ఇచ్చేసింది.

ఇది కూడా చదవండి: Smriti Mandhana-Palash Muchhal: సినిమా తరహాలో లవ్, ప్రపోజ్, బ్రేకప్.. స్మృతి-పలాష్ ఫుల్ డీటెయిల్స్ ఇవే!
ఇదిలా ఉంటే సోమవారం కూడా దేశ వ్యాప్తంగా వివిధ ఎయిర్‌పోర్టుల్లో ఇండిగో విమానాలను రద్దు చేసింది. ఇవాళ 450 విమానాలు రద్దు.. హైదరాబాద్‌లో 112, ఢిల్లీలో 134, తమిళనాడులో 71, బెంగళూరులో 127 విమానాలు రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో ఇండిగో విమాన సంస్థ ప్రయాణికులకు సలహా జారీ చేసింది. ఢిల్లీ విమానాశ్రయ ప్రయాణికులకు ఒక విజ్ఞప్తి చేసింది. ఇండిగో విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. బయల్దేరే ముందు వైబ్‌సైట్ చూసుకోవాలని.. అసౌకర్యానికి గురి కాకాకుండా ఏర్పాట్లు చేసుకోవాలంటూ తెలిపింది.

ఇదిలా ఉంటే ఇండిగో సంక్షోభాన్ని క్యాష్ చేసుకునేందుకు కొన్ని ఎయిర్‌లైన్స్‌లు ప్రయత్నిస్తుండగా కేంద్రం కొరడా ఝుళిపించింది. సంక్షోభాన్ని క్యాష్ చేసుకోవద్దని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఎయిరిండియా స్పందించింది. ఎకానమీ క్లాస్ టికెట్ల ధరలపై పరిమితి విధించినట్లుగా వెల్లడించింది.

Beta feature
Beta feature
Beta feature
Beta feature