ఇండిగో సంక్షోభంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక స్టేట్‌మెంట్ జారీ చేసింది. దేశ వ్యాప్తంగా నెలకొన్న ఇండిగో సంక్షోభంపై అత్యవసర విచారణ చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సోమవారం పిటిషన్ విచారణకు రాగా… సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇండిగో సంక్షోభాన్ని అత్యవసరంగా విచారించలేమంటూ న్యాయస్థానం తేల్చి చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంటోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సమయంలో జోక్యం చేసుకోలేమంటూ సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇది తీవ్రమైన సమస్యేనని.. లక్షలాది మంది బాధితులు ఉన్నారని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Indigo Crisis: డంప్ యార్డ్‌ల్లా ఎయిర్‌పోర్టులు.. ఎటు చూసినా కుప్పలు తెప్పలుగా లగేజీ బ్యాగులు
ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ స్పందించాలని కోరుతూ శనివారం పిటిషన్ దాఖలైంది. ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికులకు జరిగిన నష్టాలపై జోక్యం చేసుకోవాలని.. చీఫ్ జస్టిస్ స్వయంగా విచారణ చేపట్టాలని కోరారు. పౌర విమానయాన శాఖ, డీజీసీఏలు స్టేటస్ నివేదికలు సమర్పించేలా ఆదేశించాలని… తక్షణ విచారణ కోసం ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయాలని పిటిషనర్ కోరారు. తాజాగా అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
ఇది కూడా చదవండి: Gold Rates: గోల్డ్ లవర్స్‌కు మళ్లీ షాక్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. ఏ ఎయిర్‌పోర్టుల్లో చూసినా ప్రయాణికులు, లగేజీ బ్యాగులతో కిటకిటలాడుతున్నాయి. అన్ని విమానాశ్రయాలు డంప్ యార్డులను తలపిస్తున్నాయి. ఎటు చూసినా బ్యాగులు కనిపిస్తున్నాయి. కుప్పలు తిప్పలుగా పడిపోయి ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇంకోవైపు చోరీలు కూడా జరుగుతున్నాయి. తమ వస్తువులు పోయాయంటూ ప్రయాణికులు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇదిలా ఉంటే విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ ఇచ్చేసింది.
ఇదిలా ఉంటే సోమవారం కూడా దేశ వ్యాప్తంగా వివిధ ఎయిర్‌పోర్టుల్లో ఇండిగో విమానాలను రద్దు చేసింది. ఇవాళ 450 విమానాలు రద్దు.. హైదరాబాద్‌లో 112, ఢిల్లీలో 134, తమిళనాడులో 71, బెంగళూరులో 127 విమానాలు రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో ఇండిగో విమాన సంస్థ ప్రయాణికులకు సలహా జారీ చేసింది. ఢిల్లీ విమానాశ్రయ ప్రయాణికులకు ఒక విజ్ఞప్తి చేసింది. ఇండిగో విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. బయల్దేరే ముందు వైబ్‌సైట్ చూసుకోవాలని.. అసౌకర్యానికి గురి కాకాకుండా ఏర్పాట్లు చేసుకోవాలంటూ తెలిపింది.