Ram Mohan Naidu: ఇండిగో తీరుపై కేంద్రమంత్రి సీరియస్.. చర్యలు ఉంటాయని వార్నింగ్
- ఇండిగో తీరుపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సీరియస్
- చర్యలు ఉంటాయని వార్నింగ్
- రేపటి నుంచి సమస్యలు ఉండకూదని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండిగో ఎయిర్‌లైన్ సృష్టించిన సంక్షోభం అంతా ఇంతా కాదు. మంచి ఫీక్ సమయం చూసుకుని దెబ్బకొట్టింది. సహజంగా డిసెంబర్‌లో ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటిది ఎవరి మీదో కోపం.. ప్రయాణికులపై చూపించినట్లైంది. అకస్మాత్తుగా వందలాది విమాన సర్వీసులను రద్దు చేసేసి ఏమి తెలియనట్లుగా సైలెంట్‌గా ఉంది. ‘ఎవరేమైపోతే నాకేంటి?’ అన్నట్లుగా ఇండిగో వ్యవహారించింది. ఓ వైపు బుకింగ్‌లు చేస్తూనే.. ఇంకోవైపు ప్రయాణికులను విమానాశ్రయాలకు రప్పించి చివరి ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినట్లు చావు కబురు చెప్పి విచిత్రంగా వ్యవహారించింది. పాపం.. ఇండిగో ఎత్తుగడ ఎరగని ప్రయాణికులు మాత్రం చేసేదేమీ లేక విమానాశ్రయాల్లోనే చలిలో బిక్కుబిక్కుమంటూ మూడు రోజులు కాలం వెళ్లదీశారు. ప్రయాణికులు ఎదుర్కొన్న ఇబ్బందులు వర్ణనాతీతం. తిండి తిప్పలు లేక ఎయిర్‌పోర్టుల్లోనే పడిగాపులు కాశారు.
ఇది కూడా చదవండి: Indian Railways: విమాన ప్రయాణికుల కష్టాలకు రైల్వే శాఖ చెక్.. ప్రత్యేక ట్రైన్ సర్వీసులు ఏర్పాటు
Also Read
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
ఇండిగో సృష్టించిన సంక్షోభంపై విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. సంక్షోభం సృష్టించిన ఇండిగోపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. రేపటి నుంచి ప్రయాణికులకు సమస్యలు సృష్టించడం ఆపేయాలని వార్నింగ్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Shashi Tharoor: పుతిన్ విందుకు రాహుల్, ఖర్గేలకు ఆహ్వానం లేదు.. శశి థరూర్‌కి మాత్రం స్పెషల్ ఇన్విటేషన్..
నవంబర్ 1 నుంచి కొత్త విమాన డ్యూటీ నిబంధనలు అమల్లోకి వచ్చినా.. మిగతా విమానయాన సంస్థలు ఎటువంటి సమస్యలు ఎదుర్కోలేదని.. అలాంటిది ఇండిగోకే ఎందుకు ఎదురవుతాయని ప్రశ్నించారు. అంటే ఇది ఇండిగో సృష్టించిన సంక్షోభం అని స్పష్టం చేశారు. పరిస్థితులు మెరుగుపడతాయని.. రేపటి నుంచి కార్యకలాపాలు పున:ప్రారంభం అవుతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం పరిస్థితుల్ని సమీక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇండిగో అంతరాయాలను విచారించడానికి, తప్పు చేసిన వ్యక్తులను గుర్తించడానికి ఒక కమిటీ వేస్తామని వెల్లడించారు. అనంతరం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం FDTL మార్గదర్శకాలు ప్రధాన కారణమని చెబుతున్నారని.. కానీ ఇతర విమానయాన సంస్థలు కూడా (నిబంధనలు) పాటిస్తున్నాయని.. వారికి ఎటువంటి సమస్య లేదని రామ్మోహన్ నాయుడు అన్నారు.
తాజావార్తలు
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!