దేశ వ్యాప్తంగా ఇండిగో సంక్షోభం ఇంకా కొనసాగుతోంది. గత వారం నుంచి విమానాలు నిలిచిపోవడంతో అన్ని విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగిన కూడా పరిస్థితుల్లో మార్పులు కనిపించడం లేదు. విమానాల రద్దు కొనసాగుతోనే ఉంది. దీంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇది కూడా చదవండి: JK Forest: జమ్ముకాశ్మీర్‌లో ఉగ్ర స్థావరంపై స్పెషల్ పోలీసుల దాడులు.. ఆయుధాలు స్వాధీనం
తాజాగా ఇండిగో విమాన సంస్థ ప్రయాణికులకు సలహా జారీ చేసింది. ఢిల్లీ విమానాశ్రయ ప్రయాణికులకు ఒక విజ్ఞప్తి చేసింది. ఇండిగో విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. బయల్దేరే ముందు వైబ్‌సైట్ చూసుకోవాలని.. అసౌకర్యానికి గురి కాకాకుండా ఏర్పాట్లు చేసుకోవాలంటూ తెలిపింది.
ఇది కూడా చదవండి: Thailand-Cambodia War: మరోసారి కంబోడియా-థాయ్‌లాండ్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు.. వైమానిక దాడులతో టెన్షన్
గత వారం నుంచి ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. వేలాది ప్రయాణికులు విమానాశ్రయాల్లో దిగ్బంధం అయిపోయి నరకయాతన పడ్డారు. దేశీయ ప్రయాణికులతో పాటు విదేశీ ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇండిగో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఇంకొందరైతే వెక్కి వెక్కి ఏడ్చారు. మరికొందరైతే సోషల్ మీడియా వేదికగా ఆవేదన, ఆక్రోషం వెళ్లబుచ్చారు. తమ సమస్యలు పట్టించుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయినా కూడా పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పులు కనిపించడం లేదు.
ఇదిలా ఉంటే ఇండిగో సంక్షోభాన్ని క్యాష్ చేసుకునేందుకు కొన్ని ఎయిర్‌లైన్స్‌లు ప్రయత్నిస్తుండగా కేంద్రం కొరడా ఝుళిపించింది. సంక్షోభాన్ని క్యాష్ చేసుకోవద్దని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఎయిరిండియా స్పందించింది. ఎకానమీ క్లాస్ టికెట్ల ధరలపై పరిమితి విధించినట్లుగా వెల్లడించింది.
Delhi Airport issues a passenger advisory: "IndiGo flights may continue to experience delays. Passengers are advised to check the latest flight status with their airline before heading to the airport to avoid any inconvenience…" pic.twitter.com/C8QNkf4EAj
— ANI (@ANI) December 8, 2025