Australia: ఆస్ట్రేలియాలో ఒక భారతీయులు దారుణమైన జాతి వివక్షను ఎదుర్కొన్నారు. కొందరు దుండగులు అతడిని దుర్భాషలాడుతూ, తీవ్రంగా దాడి చేశారు. గత వారం దక్షిణ ఆస్ట్రేలియన్ నగరమైన అడిలైడ్‌లో ఓ కార్ పార్కింగ్ వివాదంలో, గుర్తు తెలియని వ్యక్తులు చరణ్‌ప్రీత్ సింగ్ అనే వ్యక్తిపై దాడి చేశారు. కింటోర్ అవెన్యూలో శనివారం రాత్రి 9.22 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది.
ఢిల్లీకి చెందిన భారతీయ విద్యార్థిని తాన్య త్యాగి కెనడాలో అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఈ మేరకు భారత రాయబార కార్యాలయం తెలిపింది. జూన్ 17న చనిపోయిందని.. మరణానికి కారణాలేంటో తెలియదని పేర్కొంది.
అమెరికా పోలీసులు అమానుషానికి పాల్పడ్డారు. ఒక భారతీయ విద్యార్థి పట్ల అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. న్యూజెర్సీలోని న్యూవార్క్ విమానాశ్రయంలో ఒక భారతీయ విద్యార్థి పట్ల దుర్మార్గంగా ప్రవర్తించారు.
కెనడాలో భారతీయ విద్యార్థిని వంశిక అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆమె మరణవార్తను భారత హైకమిషన్ ధృవీకరించింది. కేసు దర్యాప్తులో ఉందని తెలిపింది.
అక్రమ వలసదారులపై అగ్రరాజ్యం అమెరికా ఉక్కుపాదం మోపింది. ఇప్పటికే అక్రమంగా అమెరికాలోకి ప్రవేశిస్తున్న భారతీయులను వెనక్కి పంపేసింది. తాజాగా భారతీయ పరిశోధకుడు బాదర్ ఖాన్ సూరి అమెరికాలో బహిష్కరణకు గురయ్యాడు. హమాస్‌కు మద్దతుగా.. యూదు మతానికి వ్యతిరేకంగ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో బాదర్ ఖాన్ సూరిపై బహిష్కరణ వేటు వేసింది.
భారత సంతతికి చెందిన విద్యార్థిని సుదీక్ష కోనంకి(20) డొమినికన్ రిపబ్లిక్‌లోని బీచ్‌లో హఠాత్తుగా అదృశ్యమైంది. అర్ధరాత్రి సమయంలో బికినీ ధరించి బీచ్‌లో నడుస్తుండగా కనిపించకుండా పోయింది. మార్చి 6న స్నేహితులతో కలిసి కరేబియన్ దేశానికి విహార యాత్రకు వెళ్లినప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది.
అమెరికాలో జరిగిన రోడ్డుప్రమాదంలో భారతీయ విద్యార్థిని నీలం షిండే (35) పరిస్థితి విషమంగా ఉంది. ఈనెల 14న ఆమె ప్రయాణించిన కారు ప్రమాదానికి గురైంది. అప్పటి నుంచి ఆమె ఐసీయూలో ఉంది.
కెనడాలో భారతీయులపై దాడులు పెరుగుతున్నాయి. ప్రతిరోజూ భారతీయులను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా భారతీయ విద్యార్థిని హత్య కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సర్నియాలో భారతీయ విద్యార్థిని కత్తితో పొడిచి చంపారు. బాధితుడిని పంజాబ్‌కు చెందిన గురాసిస్ సింగ్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే కొందరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న భారతీయ విద్యార్థిని గుర్తించారు.
అమెరికాలో తెలంగాణకు చెందిన రాజేష్ అనే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. రాజేష్ మృతికి కారణమేంటో తెలియలేదు. మృతదేహం స్వగ్రామానికి తరలించేలా ఏర్పాట్లు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను బాధిత కుటుంబం కోరుతోంది. అలాగే మరణానికి గల కారణాలు తెలుసుకోవాలని అభ్యర్థిస్తున్నారు.
అమెరికా వెళ్లేందుకు.. అక్కడ చదువు కునేందు అడ్డదారులు తొక్కాడు ఓ భారతీయ విద్యార్థి. అందుకోసం ఏకంగా కన్న తండ్రినే పత్రాల్లో చంపేశాడు. తొలుత పదో తరగతి బోర్డు పరీక్షల ఫలితాలను తారుమారు చేసి.. ఇప్పుడు ఏకంగా స్కాలర్‌షిప్‌తో యూఎస్ కాలేజీ అడ్మిషన్ పొందేందుకు అక్రమార్గాలను ఎంచుకుని కటకటాలపాలయ్యాడు.