అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థిని నితీషా కందుల(23) క్షేమంగా ఉన్నట్లు యూఎస్ పోలీసులు తెలిపారు. మే 28న నితీషా అదృశ్యమైంది. కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీలోని శాన్ బెర్నార్డినోలో ఆమె మాస్టర్స్చేస్తోంది. ఆమె ఆచూకీ కనుగొన్నట్లు పోలీసులు తెలిపారు.
Missing: విదేశాల్లో చదువుకుంటున్న భారతీయలు ఇటీవల కాలంలో విపరీత పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. ప్రమాదాల్లో చనిపోవడం, ఇతర కారణాల వల్ల దాడులకు గురికావడం, ఇక్కడ ఉంటున్న తల్లిదండ్రుల్ని, వారి కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ఆస్ట్రేలియాలో దారుణం జరిగింది. భారతీయ విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు దుర్మరణం చెందారు. మృతుడు హర్యానాలోని కర్నాల్ ప్రాంతానికి చెందిన వాసిగా గుర్తించారు.
లండన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నీతి ఆయోగ్ మాజీ ఉద్యోగి చీస్తా కొచ్చర్ (33) ప్రాణాలు కోల్పోయారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో కొచ్చర్ పీహెచ్‌డీ చేస్తున్నారు.
Indian Student: అమెరికాలో మరో భారతీయ విద్యార్థి మరణించాడు. ఈ ఏడాది ఇది 5వ ఘటన. వరసగా జరుగుతున్న ఈ సంఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా భారతీయ సంతతికి చెందిన విద్యార్థి సమీర్ కామత్ సోమవారం శవమై కనిపించాడు. సమీర్ కామత్ ఇండియానా పర్డ్యూ యూనివర్సిటీలో చదువుతున్నారు. యూఎస్ సిటిజన్‌షిప్ ఉన్న కామత్ మరణంపై విచారణ జరుగుతోంది.
అమెరికాలో మరో భారతీయ విద్యార్థి శ్రేయాస్ రెడ్డి బెణిగేరి అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. ఒహియోలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే, ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
అమెరికాలోని పర్డ్యూ విశ్వవిద్యాలయంలో చదువుతున్న భారతీయ విద్యార్థి మృతిచెందాడు. భారతీయ విద్యార్థి నీల్ ఆచార్య మృతి చెందినట్లు మంగళవారం విశ్వవిద్యాలయానికి చెందిన కంప్యూటర్ సైన్స్ తాత్కాలిక విభాగాధిపతి క్రిస్ క్లిఫ్టన్ తెలిపారు. అతడి మృతదేహాన్ని క్యాంపస్‌లోని ఓ భవనం వద్ద గుర్తించామని పేర్కొన్నారు. కాలేజ్ మ్యాగజైన్ ‘ది ఎక్స్‌పోనెంట్’లోనూ ఈ ఘటనకు సంబంధించిన వార్తను ప్రచురించారు. నీల్ ఆచార్య మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆదివారం 12:30 నుంచి తన కుమారుడు కనిపించడం లేదని నీల్…
మూడు నెలల క్రితం బ్రిటన్ వెళ్లిన భారత విద్యార్థి మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. లండన్‌లోని థేమ్స్ నదిలో అతడు శవమై కనిపించాడు. ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లిన అతడు గత నెల నవంబర్ 17న కనిపించకుండ పోయాడు. దీంతో లండన్‌లోని అతడి బంధువులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులకు నవంబర్ 21న లండన్‌లోని థేమ్స్ నదిలో అతని మృతదేహాన్ని మెట్రోపాలిటన్ పోలీసులు గుర్తించారు. అయితే అతడి హత్యగల కారణాలు తెలియాల్సి…
సిడ్నీ నగరంలో మంగళవారం తనపై ఖలిస్థానీ వేర్పాటు వాదులు దాడి చేసినట్లు భారత్‌కు చెందిన ఓ విద్యార్థి తెలిపాడు. వెస్టర్న్ సిడ్నీలోని వెస్ట్‌మేడ్ ఏరియాలో దాదాపు 7, 8 మంది ఖలిస్థానీ మద్దతుదారులు తనను విచక్షణా రహితంగా కొట్టారని అతడు పేర్కొన్నాడు. తనపై దాడి చేస్తున్న.. సమయంలో ఆ మూక ఖలిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిందని చెప్పుకొచ్చాడు.