US: అమెరికాలో ప్రమాదం.. కోమాలో భారతీయ విద్యార్థిని.. ఎమర్జెన్సీ వీసా ఇవ్వాలని పేరెంట్స్ విజ్ఞప్తి
- అమెరికాలో కారు ప్రమాదం
- కోమాలో భారతీయ విద్యార్థిని నీలం షిండే
- ఎమర్జెన్సీ వీసా ఇవ్వాలని పేరెంట్స్ విజ్ఞప్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాలో జరిగిన రోడ్డుప్రమాదంలో భారతీయ విద్యార్థిని నీలం షిండే (35) పరిస్థితి విషమంగా ఉంది. ఈనెల 14న ఆమె ప్రయాణించిన కారు ప్రమాదానికి గురైంది. అప్పటి నుంచి ఆమె ఐసీయూలో ఉంది. ప్రస్తుతం కోమాలోకి వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నీలం షిండేది మహారాష్ట్రలోని సతారా జిల్లా. ఈ పరిణామంపై లోక్‌సభ ఎంపీ సుప్రియా సూలే స్పందించారు. కుమార్తెను చూసేందుకు తల్లిదండ్రులకు అత్యవసర వీసా మంజూరు అయ్యేలా చూడాలని కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి: Michelle Trachtenberg: హాలీవుడ్ నటి మిచెల్ ట్రాచ్టెన్‌బర్గ్ అనుమానాస్పద మృతి
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
ఇదిలా ఉంటే ప్రమాదం చేసిన కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరి 16న ప్రమాదం జరిగినట్లుగా తమకు తెలిసిందని తండ్రి తనాజీ షిండే పేర్కొన్నారు. అప్పటి నుంచి వీసా కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. కానీ ఇప్పటి వరకు తమకు వీసా రాలేదని వాపోయాడు. దీంతో ఎన్‌సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సులే స్పందించి.. వీసా ఇప్పించడానికి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సహాయం కోరినట్లు తెలిపారు. ఈ సమస్యను త్వరగా కేంద్రం పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఆ కుటుంబానికి తాము అండగా ఉంటామని ఎంపీ హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే కారు ప్రమాదంలో బాధితురాలి కాళ్లు, చేతులు విరిగిపోయినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా తలకు గాయాలు కావడంతో కోమాలోకి వెళ్లినట్లు సమాచారం. నీలం షిండే గత నాలుగేళ్లుగా అమెరికాలో ఉంటుంది. ఈ ఏడాదితో చదువు పూర్తవుతుంది. ఇంతలోనే ఈ ప్రమాదం జరిగింది.
ఇది కూడా చదవండి: Online Love Scam: ఇలా ఉన్నారేంట్రా బాబు.. వాట్సప్ లోనే పరిచయం.. ప్రేమ..పెళ్లి.. కాపురం!
Student Neelam Shinde has met with an accident in the USA and is hospitalized in a local hospital. Her father, Tanaji Shinde, from Satara, Maharashtra, India, urgently needs to visit his daughter due to a medical emergency. Tanaji Shinde has applied for an urgent visa to the USA…
— Supriya Sule (@supriya_sule) February 26, 2025
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!