అక్రమ వలసదారులపై అగ్రరాజ్యం అమెరికా ఉక్కుపాదం మోపింది. ఇప్పటికే అక్రమంగా అమెరికాలోకి ప్రవేశిస్తున్న భారతీయులను వెనక్కి పంపేసింది. తాజాగా భారతీయ పరిశోధకుడు బాదర్ ఖాన్ సూరి అమెరికాలో బహిష్కరణకు గురయ్యాడు. హమాస్‌కు మద్దతుగా.. యూదు మతానికి వ్యతిరేకంగ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో బాదర్ ఖాన్ సూరిపై బహిష్కరణ వేటు వేసింది. సోమవారం వర్జీనియాలోని అతని ఇంటి వెలుపుల డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఏజెంట్లు అరెస్ట్ చేశారు. అనంతరం అతడి వీసాను రద్దు చేసింది.
ఇది కూడా చదవండి: Merchant Navy officer Murder: వెలుగులోకి నిందితురాలి వాట్సప్ చాట్.. హతుడి సోదరికి ఏం పంపిందంటే..!
బాదర్ ఖాన్ సూరి అమెరికాలోని జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు. ప్రస్తుతం స్కాలర్‌గా ఉన్నాడు. అయితే సూరిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్టు చేశారని, ఆయన బహిష్కరణకు గురయ్యారని ఆయన న్యాయవాది తెలిపారు. సోమవారం రాత్రి వర్జీనియాలోని తన ఇంటి వెలుపల అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.
సోషల్ మీడియా వేదికగా బాదర్ ఖాన్ సూరి.. హమాస్ ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నాడు. అంతేకాకుండా అనుమానిత ఉగ్రవాదితో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. దీంతో అతడి వీసాను అమెరికా రద్దు చేసింది. యూదు వ్యతిరేకతను ప్రచారం చేస్తున్నట్లుగా గుర్తించినట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం అసిస్టెంట్ సెక్రటరీ ట్రిసియా మెక్‌లాఫ్లిన్ ఎక్స్‌లో రాశారు. హమాస్‌కు సంబంధించిన ఉగ్రవాదితో కూడా సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈనేపథ్యంలో ఐఎన్ఏ సెక్షన్ 237(a)(4)(C)(i) కింద అతన్ని బహిష్కరించాలని మార్చి 15, 2025న విదేశాంగ కార్యదర్శి సర్క్యూలర్ జారీ చేశారు.
ఇది కూడా చదవండి: AP Assembly 2025: 15వ రోజు అసెంబ్లీ సమావేశాలు.. ఎస్సీ వర్గీకరణపై నేడు తీర్మానం!
బాదర్ ఖాన్ సూరి.. 2020లో న్యూఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియాలోని నెల్సన్ మండేలా సెంటర్ ఫర్ పీస్ అండ్ కాన్ఫ్లిక్ట్ రిజుల్యూషన్ నుంచి శాంతి, కాన్ఫ్లిక్ట్ స్టడీస్‌లో పీహెచ్‌డీ పూర్తి చేశాడు. మరొక పరిశోధన కోసం అమెరికాలోని జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నాడు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో హమాస్‌కు అనుకూలంగా.. యూదు మతానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం మొదలు పెట్టాడు. చివరికి అమెరికా నుంచి బహిష్కరణకు గురయ్యాడు.
ఇది కూడా చదవండి: Rohit Sharma: రోహిత్ శర్మ ఫుల్ చిల్.. ఒక్క రాత్రికి రూ.23 లక్షలు!