యూకేలో ఓ మహిళపై భారతీయ విద్యార్థి ప్రీత్ వికల్ అత్యాచారానికి పాల్పడ్డాడు. అందుకు సంబంధించి దృశ్యాలు సీసీ టీవీలో రికార్డయ్యయి. మద్యం మత్తులో ఆ మహిళను తన చేతుల్లో మరియు భుజాల మీద తీసుకెళ్తున్నట్లు కనిపించాయి. దీంతో ఆ యువకుడు అత్యాచారం చేసినట్లు అక్కడి పోలీసులతో చెప్పాడు. అయితే యువ నేరస్థుల సంస్థలో అతనికి 6 సంవత్సరాల 9 నెలల జైలు శిక్ష విధించారు.
బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌ను చంపేస్తానని గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ బెదిరించిన సంగతి తెలిసిందే. ఆయనకు మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఈ సారి మాత్రం బెదిరించింది గ్యాంగ్‌స్టర్ కాదు.. ఓ విద్యార్థి.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయులు, విద్యార్ధులను తీసుకువచ్చేందుకు విదేశాంగ శాఖ శక్తివంచన లేకుండా పనిచేస్తోంది. సుమారు 2 వేల నుంచి 3 వేల మంది భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్ యుద్ధ జోన్లలో ఉండొచ్చని అంచనా వేసింది విదేశాంగ శాఖ. ఇదిలా వుంటే.. ఉక్రెయిన్ నుంచి రాష్ట్ర విద్యార్థుల తరలింపుకు స్పెషల్ ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం. ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు రాష్ట్ర ప్రతినిధుల్ని పంపిస్తోంది. హంగేరీలోని బుడాపెస్ట్ కు చేరుకున్నారు ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షుడు వెంకట్…
ఉక్రెయిన్ లో భారత విద్యార్థులు బందీలుగా ఉన్నారన్న అంశంపై వివరణ ఇచ్చింది కేంద్ర విదేశాంగ శాఖ. విద్యార్థులు బందీలుగా ఉండటంపై మాకు ఎలాంటి నివేదికలు అందలేదు. ఉక్రెయిన్‌లోని ఇండియా ఎంబసీ భారతీయ పౌరులతో నిరంతరం టచ్‌లో ఉంది. ఉక్రేనియన్ అధికారుల సహకారంతో చాలా మంది విద్యార్థులు నిన్న ఖార్కివ్ నుండి బయలుదేరారు. భారత పౌరుల తరలింపునకు ఉక్రేనియన్ అధికారులు అందించిన సహాయాన్ని అభినందిస్తున్నాం. భారతీయుల తరలింపులో సహకారం అందిస్తున్న ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు ధన్యవాదాలు తెలిపింది విదేశాంగ…
ఉక్రెయిన్-రష్యా యుద్ధ జరుగుతోన్న సమయంలో ఇప్పటికే ఓ భారత విద్యార్థి మృతి చెందిన విషయం తెలిసిందే కాగా.. తాజాగా మరో విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.. పంజాబ్‌కు చెందిన చందన్ జిందాల్ అనే 22 ఏళ్ల మెడికల్ విద్యార్థి మృతిచెందాడు… అనారోగ్య సమస్యలతో చందన్ జిందాల్ కన్నుమూసినట్టు చెబుతున్నారు.. రక్త గడ్డ కట్టడంతో చందన్ జిందాల్‌ను వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు.. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. బ్రెయిన్ స్ట్రోక్కారణంగా అతడు మృతిచెందినట్టు జాతీయ మీడియా పేర్కొంది.. ఉక్రెయిన్…
ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న దాడుల్లో ఉక్రెయిన్ సైనికులతో పాటు సాధారణ ప్రజలు కూడా మరణిస్తున్నారు. ఇరు దేశాల యుద్ధం ప్రారంభమై మంగళవారం నాటికి ఆరు రోజులు అవుతోంది. రోజురోజుకు యుద్ధం తీవ్రత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ఉక్రెయిన్‌పై రష్యా చేసిన దాడుల్లో భారత్‌కు చెందిన ఓ విద్యార్థి మృతి చెందాడు. రెండో అతిపెద్ద నగరమైన ఖర్కీవ్‌లో రష్యా మిస్సైల్ దాడిలో కర్ణాటకకు చెందిన మెడికల్ విద్యార్థి నవీన్ మరణించాడు. భారత విద్యార్థి నవీన్ ఆహారం…
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం ఇతర దేశాలపై పడుతోంది. ముఖ్యంగా విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖార్కివ్ నగరంలో జరిగిన రష్యా రాకెట్ దాడిలో భారతీయ విద్యార్ధి మరణించినట్టు తెలుస్తోంది. కర్నాటకకు చెందిన విద్యార్ధిగా భారత విదేశాంగ శాఖ తెలిపింది. మృతి చెందిన విద్యార్థి కుటుంబంతో మాట్లాడుతున్నామని చెప్పింది విదేశీ వ్యవహరాల శాఖ. విద్యార్ఘి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసింది విదేశీ వ్యవహరాల శాఖ. విదేశీ వ్యవహారాల శాఖకు చెందిన అధికారి దీనిని ట్విట్టర్ ద్వారా ధృవీకరించారు.
ఉక్రెయిన్-రష్యా యుద్ధంతో విదేశీయులు ముఖ్యంగా అక్కడ విద్యాభ్యాసం కోసం వెళ్ళిన భారతీయులు నానా అవస్థలు పడుతున్నారు. తెలుగు విద్యార్ధులు నానా కష్టాలు పడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. కరీంనగర్ జిల్లా రామచంద్రాపురం ప్రాంతానికి చెందిన యువతి కడారి సుమాంజలి ఉక్రెయిన్ లో ఇక్కట్లు పడుతోంది. ఆమె అవస్థలు అన్నీ ఇన్నీకావు. 4 రోజుల నుంచి ఆహారం కూడా లేదని ఆమె ఆవేదన చెందుతోంది. కూతురి కష్టాలు చూసిన తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. ఎంబసీ అధికారులు…
ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయ విద్యార్ధులు ఒక్కొక్కరుగా స్వదేశానికి చేరుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులు బెంగళూరు, హైదరాబాద్ చేరుకుని తమ తమ ప్రాంతాలకు వెళుతున్నారు. తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నారు 23 మంది తెలంగాణ విద్యార్థులు. ఉక్రెయిన్ నుంచి ఢిల్లీ… ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరారు విద్యార్ధులు. హైదరాబాద్ శంషాబాద్ లో ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థిని రిసీవ్ చేసుకున్నారు అధికారులు. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన సాయి స్కందనను రిసీవ్…
రష్యా తమపై దాడులు చేస్తోందని, కాపాడాలని ఉక్రెయిన్ భారత్ ని కోరుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత ప్రాధాన్యత ఉన్న వ్యక్తి. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భారత ప్రధాని మాట్లాడాలి. శాంతి నెలకొనేందుకు ప్రయత్నం చెయ్యాలి. భారత్ సపోర్ట్ మాకు కావాలంటున్నారు ఉక్రెయిన్ రాయబారి. ఉక్రెయిన్‌కు నాటో సంఘీభావంగా నిలుస్తోంది. ఉక్రెయిన్‌పై నిర్లక్ష్యపూరిత దాడికి పాల్పడినందుకు రష్యాపై నాటో మిత్రదేశాలు తీవ్ర ఆంక్షలు విధిస్తుంది. EU మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర భాగస్వాములతో సన్నిహిత సమన్వయంతో…