Kakinada: కాకినాడ జిల్లాలో జరిగిన హత్య కేసులో 23 ఏళ్ల తర్వాత కీలక పరిణామం చోటు చేసుకుంది. భార్యా పిల్లలను హత్య చేసిన కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న శేషుబాబుకు సుప్రీంకోర్టు శిక్షను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ తీర్పును వెలువరించింది.
Delhi High Court: 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ముందస్తు బెయిల్ మంజూరుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. స్నేహాన్ని అత్యాచారానికి లైసెన్సుగా పరిగణించలేమని, లైంగిక వేధింపులు, నిర్భంధం, శారీరక హింసకు స్నేహాన్ని రక్షణగా ఉపయోగించలేమని పేర్కొంది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ నిందితుడికి బెయిల్‌ను నిరాకరించారు.
Justice Surya Kant: భారతదేశ 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవై ప్రమాణ స్వీకారం చేసిన ఐదు నెలల తర్వాత, ఆయన వారసుడిని నియమించే ప్రక్రియ ప్రారంభమైంది. తదుపరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్ సూర్యకాంత్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత సీజేఐ గవాయ్ పదవీకాలం ఈ ఏడాది నవంబర్ 23తో ముగుస్తోంది. రేపటిలోగా తన వారసుడిని సిఫారసు చేయమని కోరుతూ ప్రభుత్వం గవాయ్‌కి లేఖ రాసినట్లు సమాచారం. గవాయ్ నవంబర్ 23, 2025న పదవీ…
Supreme Court: వైవాహిక వివాద కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘భార్య,భర్తను తన చుట్టూ తిప్పించుకోకూడదు’’ అని వ్యాఖ్యానించింది. భార్యాభర్తలు ఇద్దరు తన పిల్లల కోసం ఈగోలను పక్కన పెట్టాలని కోరింది. న్యాయమూర్తులు బీవీ నాగరత్న, ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం పిల్లల సంక్షేమానికి తల్లిదండ్రులు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పింది. మధ్యవర్తిత్వం ద్వారా విభేదాలను పరిష్కరించుకోవాలని సూచించింది.
Pawan Kalyan: భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ కేసు విచారణ సమయంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ఓ లాయర్ దాడికి యత్నించాడు. ఈ అంశంపై తాజాగా జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. హింసకు సనాతనంలో చోటు లేదని పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌పామ్ ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తిపై దాడి ప్రయత్నాన్ని ఖండించారు. “ఇది…
PM Modi: ప్రధాన న్యాయమూర్తిపై దాడి ప్రయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా ప్రధాని మోడీ స్పందించారు. బి.ఆర్. గవాయ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆవరణలో ఆయనపై జరిగిన దాడి ప్రతి భారతీయుడిని ఆగ్రహానికి గురిచేసిందని మోడీ తెలిపారు. మన సమాజంలో ఇటువంటి చర్యలకు చోటు లేదు. ఇది చాలా సిగ్గుచేటని అన్నారు. ఈ మేరకు మోడీ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. "భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్ జీతో మాట్లాడాను. ఈరోజు…
High Court: తన భర్తని కుటుంబ సభ్యులతో సంబంధాలు తెంచుకోవాలని భార్య ఒత్తిడి చేయడం క్రూరత్వానికి సమానమని, ఒక జంట వివాహాన్ని రద్దు చేస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. పదే పదే బహిరంగంగా అవమానించడం, భాగస్వామిని తిట్టడం మానసిక క్రూరత్వమే అని హైకోర్టు పేర్కొంది.
CJI BR Gavai: ఖజురహోలోని విష్ణు విగ్రహానికి సంబంధించిన పిటిషన్‌ను విచారిస్తున్న సమయంలో భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) బీఆర్ గవాయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదాన్ని రాజేశాయి. ఖజురహోలోని పురాతన విష్ణువు విగ్రహం ధ్వంసం చేయబడిందని, దీనిని మళ్లీ తిరిగి ఏర్పాటు చేయాలని కోరుతూ, సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేయబడింది. ఖజురహోలో ఏడు అడుగుల ఎత్తైన విష్ణువు విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలపై…
CBI: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) వద్ద పెండింగ్‌లో 7,072 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు తాజాగా విడుదలైన కేంద్ర నిఘా కమిషన్(సీవీసీ) వార్షిక నివేదిక వెల్లడించింది. డిసెంబర్ 31, 2023 నాటికి ఈ కేసులు పెండింగ్‌లో ఉండగా, వీటిలో 379 హైప్రొఫైల్ కేసులు ఉన్నట్లుగా చెప్పింది. ఇవి 20 ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం కేసుల్లో 1,056 కేసులు దర్యాప్తు దశలో ఉండగా, మిగతా 6,016 కేసులు వివిధ కోర్టుల్లో విచారణ దశలో ఉన్నాయి. ఈ…