Supreme Court: ‘‘పైజామా దారం లాగడం అత్యాచార ప్రయత్నమే’’..
- పైజామా దారం లాగడం అత్యాచార ప్రయత్నమే..
- అలహాబాద్ హైకోర్టు తీర్పును తప్పుపట్టిన సుప్రీంకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: అత్యాచారం కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ‘‘పైజామా దారం విప్పడం అత్యాచార ప్రయత్నం కిందకు వస్తుంది’’ అని అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. అలహాబాద్ హైకోర్టును తీవ్ర స్థాయిలో మందలించింది. ఒక అమ్మాయి రోమ్మును పట్టుకోవడం, ఆమె పైజామా దారాన్ని విప్పడం, ఆమెను కల్వర్టు కిందకు లాగడానికి ప్రయత్నించడం అత్యాచారం లేదా అత్యాచార ప్రయత్నం కాదని గతంలో అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
అలహాబాద్ హైకోర్టు తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ.. భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జోయ్‌మల్య బాగ్చీ, ఎన్వీ అంజరియాలతో కూడిన ధర్మాసనం లైంగిక నేరాల కేసులో నిర్ణయాలను చట్టపరమైన తార్కికం, సానుభూతితో చూడాలని పేర్కొంది. ‘‘వక్షస్థలం పట్టుకోవడం, పైజామా దారాన్ని లాగడం’’ అత్యాచార ప్రయత్నంగా పరిగణించబడుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
కేవలం రోమ్ము పట్టుకోవడం, పైజామా తాడును లాగడం అత్యాచారం కాదని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పరిగణలోకి తీసుకుని, ఫిబ్రవరి 10న సుమోటోగా దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు నిర్ణయాన్ని తప్పుబడుతూ.. లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (POCSO) చట్టం కింద ఇద్దరు నిందితులపై అత్యాచారయత్నం అభియోగాలను తిరిగి మోపింది. ‘‘నిందితులు చేసిన ప్రయత్నం స్పష్టంగా అత్యాచారం కోసమే ఇలాంటి పనులు చేశారు’’ అని చెప్పింది.
కేసు ఏమిటి.. గతంలో హైకోర్టు తీర్పు:
2021 నవంబర్ 10న ఒక మహిళ, తన 14 ఏళ్ల కుమార్తెతో కలిసి ఇంటికి వస్తుండగా, పక్క గ్రామానికి సంబంధించిన ముగ్గురు యువకులు బైక్‌పై కలిసి వచ్చి, లిఫ్ట్ ఇచ్చే పేరుతో వారిని ఆపారు. బాలికను బలవంతంగా కాలువ కిందకు తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. ఆమె ప్యాంట్ నాడా లాగడం,బ్రెస్ట్ పట్టుకోవడం వంటి చర్యలు చేశారు. అయితే బాలిక కేకలు విన్న సమీపంలోని వ్యక్తులు రావడంతో, నిందితులు బాలికను వదిలేసి పారిపోయారు.
ఈ కేసుపై అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 2025 మార్చి 17న ఇచ్చిన తీర్పులో.. బాలిక బ్రెస్ట్ పట్టుకోవడం, ఆమె పైజామా నాడా లాగడం రేప్ కాదని, రేప్ ముందు చేసే ప్రక్రియ మాత్రమే అని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఈ తీర్పుపై విమర్శలు వచ్చాయి. దీంతో సుప్రీంకోర్టు దీనిని సుమోటోగా స్వీకరించి తీర్పు చెప్పింది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!