PM Modi: భారత ప్రధాన న్యాయమూర్తిపై దాడికి యత్నం.. ప్రధాని మోడీ రియాక్షన్ ఇదే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధాన న్యాయమూర్తిపై దాడి ప్రయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా ప్రధాని మోడీ స్పందించారు. బి.ఆర్. గవాయ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆవరణలో ఆయనపై జరిగిన దాడి ప్రతి భారతీయుడిని ఆగ్రహానికి గురిచేసిందని మోడీ తెలిపారు. మన సమాజంలో ఇటువంటి చర్యలకు చోటు లేదు. ఇది చాలా సిగ్గుచేటని అన్నారు. ఈ మేరకు మోడీ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. “భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్ జీతో మాట్లాడాను. ఈరోజు ఉదయం సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఆయనపై జరిగిన దాడి ప్రతి భారతీయుడిని ఆగ్రహానికి గురిచేసింది. మన సమాజంలో ఇటువంటి చర్యలకు చోటు లేదు. ఇది పూర్తిగా ఖండించదగినది. దాడి జరిగినప్పుడు జస్టిస్ గవాయ్ ప్రశాంతతను ప్రదర్శించినందుకు నేను అభినందించాను. ఇది న్యాయ విలువల పట్ల, మన రాజ్యాంగ స్ఫూర్తిని బలోపేతం చేయడం పట్ల ఆయన నిబద్ధతను హైలైట్ చేస్తుంది.” అని మోడీ ట్వీట్‌లో పేర్కొన్నారు.
READ MORE: Indo Thai Securities Share: లక్షాధికారులను చేసిన రెండు రూపాయల షేర్లు..
Also Read
- AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
- Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
- AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
సుప్రీంకోర్టులో అమానుష ఘటన చోటుచేసుకుంది. దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి గవాయ్‌పై దాడి జరిగింది. బీఆర్.గవాయ్‌పై ఓ న్యాయవాది దాడికి యత్నించాడు. గవాయ్‌పై షూ విసిరాడు. దీంతో కోర్టు ప్రాంగణం ఒక్కసారిగా గందరగోళంగా మారింది. ‘‘సనాతన్ కా అప్మాన్ నహీ సహేంగే’ అని అరుస్తూ ఓ న్యాయవాది దాడికి పాల్పడ్డాడు. అయినా కూడా గవాయ్ ఏ మాత్రం ఆందోళన చెందలేదు. ఇలాంటి దాడులు తనను ఏ మాత్రం ప్రభావితం చేయవని వ్యాఖ్యానించి ప్రశాంతంగా ఉండిపోయారు. అనంతరం విచారణను యథావిధిగా కొనసాగించేశారు. బార్ అండ్ బెంచ్ నివేదిక ప్రకారం.. సీజేఐ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని బెంచ్ ముందు కేసుల విచారణ జరుగుతోంది. ఓ న్యాయవాది వేదిక దగ్గరకు వెళ్లి ప్రధాన న్యాయమూర్తిపైకి షూ విసిరేందుకు ప్రయత్నిస్తుండగా భద్రతా సిబ్బంది వేగంగా స్పందించి అడ్డుకున్నారు. అనంతరం న్యాయవాదిని కోర్టు వెలుపలకు లాక్కెళ్లిపోయారు. కోర్టు గది నుంచి బయటకు తీసుకెళ్తుండగా న్యాయవాది ‘‘సనాతన్ కా అప్మాన్ నహీ సహేంగే’’ (సనాతన్‌ను అవమానించడాన్ని మేము సహించం) అంటూ అరుస్తూ కనిపించాడు. నిందితుడు వృద్ధ న్యాయవాది అయిన కిషోర్ రాకేష్‌గా గుర్తించారు. ఇతనికి ప్రాక్సిమిటీ కార్డు ఉన్నట్లుగా తెలిసింది. అయితే.. బార్ అసోసియేషన్ అతడిపై చర్యలు తీసుకుంది. ప్రాక్టీస్ లైసెన్స్‌ను రద్దు చేసింది.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!