BR Gavai: ముంబై విశ్వవిద్యాలయంలో జరిగిన ‘అఫర్మేటివ్ యాక్షన్ అండ్ ఈక్వల్ ఆపర్చునిటీ’ అంశంపై భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) బీఆర్ గవాయ్ మాట్లాడుతూ.. షెడ్యూల్డ్ కులాల (SC) రిజర్వేషన్లలో “క్రీమీ లేయర్” సూత్రాన్ని అమలు చేయాలని తాను ఇచ్చిన తీర్పుపై సొంత కులం నుంచే విమర్శలను ఎదురవుతున్నట్లు వెల్లడించారు. ఇతర వెనుకబడిన వర్గాల (OBC) కోసం అమలు చేస్తున్నట్లే SC/STల్లో కూడా ఆర్థికంగా పురోగతి సాధించిన వారిని రిజర్వేషన్ పరిధి నుంచి తప్పించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. OBCలకు వార్షిక ఆదాయం రూ.8 లక్షలకు పైబడి ఉంటే రిజర్వేషన్ అర్హత కోల్పోయే విధంగా చట్టం ఉందని గుర్తు చేశారు. అలాంటి విధానమే SC/STలకు కూడా వర్తించాలనే గవాయ్ పేర్కొన్నారు.
Read Also: Zepto Order: జెప్టోలో కూరగాయలు ఆర్డర్ చేసిన మహిళ.. రూ. 24 రిఫండ్ కోసం ప్రయత్నిస్తే రూ.87,000 పోయినయ్
అయితే, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల వంటి రాజ్యాంగపరమైన పదవులకు రిజర్వేషన్ వర్తించదన్న సంగతి కూడా విమర్శకులు గుర్తించలేదని మాజీ సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ తెలిపారు. తాను దళిత వర్గానికి చెందిన వ్యక్తిగా ఎదిగి న్యాయమూర్తినైనా.. కాబట్టి, దేశంలో SC/STల్లో ఆర్థికంగా ఎదిగిన వారిని రిజర్వేషన్ నుంచి తప్పించడం ద్వారా ఇంకా సమాజంలో కింది స్థాయిలో ఉన్న వారికి ఈ రిజర్వేషన్ల ఫలితాలు అందుతాయనే ఆలోచనతోనే ఈ తీర్పు ఇచ్చినట్లు తెలియజేశారు.
Read Also: Phone battery: చలికాలంలో ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ త్వరగా అయిపోతుంది.. ఎందుకు.?
అలాగే, సామాజికంగా వెనుకబడినవారికి ముందుకు రావడానికి ‘సైకిల్’ ఇచ్చినట్లుగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పిన విషయాన్ని భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ గుర్తు చేశారు. శూన్య బిందువులో ఉన్నవారిని పదో కిలోమీటర్ దూరంలో ఉన్నవారి వద్దకు చేరేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం.. కానీ ఎప్పటికీ సైకిల్‌పై ప్రయాణిస్తూ కొత్తగా వచ్చే వారికి అవకాశం దూరం చేయాలనేది అంబేద్కర్ దృష్టికోణం కాదని ఆయన స్పష్టం చేశారు. ఇక, 2024లో ఇచ్చిన కీలక తీర్పు గవాయ్ నాయకత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ SC/ST వర్గాల్లో కూడా క్రీమీలేయర్ అమలు చేయాలని సూచించింది. 1992లో ఇంద్రా సాహ్నీ కేసులో సుప్రీంకోర్టు క్రీమిలేయర్ సూత్రాన్ని కేవలం OBCలకు మాత్రమే వర్తిస్తుందని విషయాన్ని పేర్కొంది. అలాగే, OBCల కోసం క్రీమిలేయర్ అమలు చేస్తున్నట్లే SC/STలకు ఎందుకు వర్తించకూడదు? అని బీఆర్ గవాయ్ ప్రశ్నించారు.