Justice Surya Kant: భారతదేశ 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవై ప్రమాణ స్వీకారం చేసిన ఐదు నెలల తర్వాత, ఆయన వారసుడిని నియమించే ప్రక్రియ ప్రారంభమైంది. తదుపరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్ సూర్యకాంత్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత సీజేఐ గవాయ్ పదవీకాలం ఈ ఏడాది నవంబర్ 23తో ముగుస్తోంది. రేపటిలోగా తన వారసుడిని సిఫారసు చేయమని కోరుతూ ప్రభుత్వం గవాయ్‌కి లేఖ రాసినట్లు సమాచారం. గవాయ్ నవంబర్ 23, 2025న పదవీ విమరణ చేసే వరకు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తారు.
Read Also: S*x Warfare: టెక్ కంపెనీలపై “సె*క్స్ వార్‌ఫేర్”.. చైనా, రష్యా ఆయుధాలుగా అందమైన యువతులు..
కేంద్రం తదుపరి సీజేఐని నియమించడానికి పదవీ విరమణ చేస్తున్న సీజేఐ సిఫారసును కోరుతుంది. సాధారణంగా సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిని సీజేఐగా సిఫారసు చేస్తారు. ప్రస్తుత సీజేఐ తర్వాత అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా జస్టిన్ సూర్యకాంత్ ఉన్నారు. నవంబర్ 24న కొత్త సీజేఐగా ఈయన పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. దాదాపు 15 నెలల పాటు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తారు. ఆయన పదవీ కాలం ఫిబ్రవరి 9, 2027న ముగిసే అవకాశం ఉంది.