Monsoon: ఈ ఏడాది నాలుగు రోజులు ఆలస్యంగా అంటే జూన్ 4న నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఎల్ నినో ఎఫెక్ట్ ఉంటుందని ఐఎండీ ఇప్పటికే వెల్లడించింది. దీంతో జూన్-సెప్టెంబర్ నైరుతి రుతుపవన కాలంలో సాధారణ వర్షపాతం కన్నా తక్కువగా వర్షాలు కురిసే అవకాశం 90 శాతం ఉందని తెలిపింది. గతంలో ఎల్ నీనో ఏర్పడిన పలు సందర్భాల్లో సగటు కన్నా తక్కువ వర్షపాతం నమోదు…
Retail inflation: ఏప్రిల్ నెలలో భారతదేశ రిటైల్ ద్రవ్యోల్భణం తగ్గినట్లు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) కంఫర్ట్ జోన్ లోనే వరసగా రెండో నెల కొనసాగినట్లు నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్(ఎన్ఎస్ఓ) విడుదల చేసిన డేటాలో వెల్లడించింది. వినియోగదారుల ధర సూచి ఆధారంగా (సీపీఐ) ద్రవ్యోల్భణం 18 నెలల కనిష్ట స్థాయికి చేరుకుంది. ఏప్రిల్ నెలలో 4.7 శాతంగా ఉంది. రరిటైల్ ద్రవ్యోల్భణం మార్చి నెలలో 5.66 శాతంగా ఉంటే ఇది ఏప్రిల్ లో 4.7 శాతానికి చేరినట్లు…
India Economy: ఆర్థికమాంద్యం భయాలు, రష్యా ఉక్రెయిన్ పరిణామాలు, కోవిడ్ మహమ్మారి కలిసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నాయి. కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇన్నాళ్లు యూరోపియన్ దేశాల ఆర్థిక వ్యవస్థలు చాలా బలంగా ఉన్నాయని అనుకుంటున్నప్పటికీ, గాలి బుడగలా మారాయి. ఎప్పుడు బ్లాస్ట్ అవుతాయో తెలియని పరిస్థితి. ఇప్పటికే శ్రీలంక దివాళా తీసింది.
IMF: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 3 శాతం కన్నా తక్కువ వృద్ధిని సాధిస్తుందని, 2023లో ప్రపంచవృద్ధిలో భారత్, చైనాల వాటానే సగం ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) చీఫ్ గురువారం తెలిపారు. ఐఎంఎఫ్ మేనేజింగ్ డైెరెక్టర్ క్రిస్టాలినా జార్జివా మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రం ప్రభావం చూపించాయని, దీంతో పాటు కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర మందగమనంలో ఉందని ఆమె హెచ్చరించారు.
World Bank lowers India's FY24 growth forecast to 6.3%: ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్య పరిస్థితుతలతో సతమతం అవుతోంది. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక శక్తులు అయిన అమెరికా, చైనా, యూరోపియన్ యూనియన్ దేశాల ఆర్థిక వృద్ధి దారుణంగా ఉంటుందని పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. వీటన్నింటి ఆర్థిక వృద్ధి ఈ ఏడాది 4-5 శాతం మధ్య ఉంటుందని చెబుతున్నాయి. మరోవైపు మరో 6 నెలల నుంచి ఏడాది కాలంలో తప్పకుండా ఆర్థిక…
Jagdeep Dhankhar: రానున్న రోజుల్లో శక్తివంతమైన దేశంగా భారత్ ఎదుగుతుందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచంలో భారత్ ఎదుగుదలలో వ్యవసాయ రంగం గణనీయమైన ప్రగతిని సాధించిందని ఆయన అన్నారు.
Today (01-02-23) Business Headlines: ఇండియాలో యాపిల్ విస్తరణ: యాపిల్ కంపెనీ ఎయిర్‌పాడ్స్ విడి భాగాల తయారీ ఇండియాలో ప్రారంభమైనట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీన్నిబట్టి ఈ అమెరికా టెక్నాలజీ జెయింట్.. భారత్దేశంలో ప్రొడక్షన్‌ను విస్తరిస్తోందని చెప్పొచ్చు. యాపిల్ కంపెనీకి కీలకమైన సప్లయర్‌గా వ్యవహరిస్తున్న జాబిల్ అనే సంస్థ ఎయిర్‌పాడ్స్ ఎన్క్లోజర్లను లేదా ప్లాస్టిక్ పరికరాలను చైనాకి మరియు వియత్నాంకి సరఫరా చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
రానున్న రెండేళ్లలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించిబోతోంది.. నేటి యువతరంలో ఉన్న నైపుణ్యం, ప్రతిభ పాటవాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు గైట్ మేనేజింగ్ డైరెక్టర్ శశికిరణ్ వర్మ.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో గైట్ ఇంజినీరింగ్ కాలేజీలో ఘనంగా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్కిలి గ్రాడ్యుయేషన్ ఉత్సవం నిర్వహించారు.. ఈ సభకు అధ్యక్షత వహించిన గైట్ మేనేజింగ్ డైరెక్టర్ కె.శశీ కిరణ్ వర్మ.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనేక ఆవిష్కరణలు వినూత్నంగా చేస్తున్న…
India Set To Become World’s Third-Largest Economy By 2030: ప్రపంచదేశాలు అన్నీ ఆర్థిక మాంద్యం పరిస్థితులను ఎదుర్కొంటే ఒక్క భారతదేశం మాత్రమే మాంద్యాన్ని తప్పించుకుంటుందని పలు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇటీవలే బ్రిటన్ ను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా నిలిచింది. ఇదిలా ఉంటే 2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం నిలుస్తుందని ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మోర్గాన్ స్టాన్లీ ఓ…