అదీ ఇదీ అని కాదు.. దేశంలో నిత్యావసర సరుకుల ధరలు అడ్డూ, అదుపూ లేకుండా పెరుగుతున్నాయి. పెట్రో ధరల సెగ వంటింట్లో మంట పుట్టిస్తున్నాయి. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు ప్రజలపై మరింత భారం మోపుతున్నాయి. మధ్యతరగతి కొనుగోలు శక్తి నానాటికీ దిగజారి పోతుంది. నలుగురు కుటుంబ సభ్యుల సగటు ఖర్చు ఎనిమిదేండ్లలో రెండింతలు దాటింది. వంట నూనెల దగ్గర్నుంచి సబ్బుల వరకూ మనం రోజువారీ ఉపయోగించే సరుకు ఏదైనా సరే వాటి ధర కొండెక్కి కూర్చున్నది.…
భారతదేశ ఆర్థిక పరిస్థితి కూడా శ్రీలంక లాగే ఉందని విమర్శించారు కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ. దేశంలో పెట్రోల్ రేట్లు, నిరుద్యోగిత, మతహింసలపై ట్వీట్ చేశారు. శ్రీలంక, ఇండియా ఆర్థిక పరిస్థితికి సంబంధించి గ్రాఫ్ లతో సహా ట్విట్టర్ లో పెట్టారు. 2011 నుంచి 2017 వరకు శ్రీలంక, భారత్ దేశాల్లో పెట్రోల్ రేట్లు, నిరుద్యోగం, మతహింస ఎలా ఉందనే దానిపై ట్వీట్ చేశారు. భారత దేశ ఆర్థిక పరిస్థితి కూడా శ్రీలంక లాగే…
తెలంగాణలో రాజకీయ వేడి పెరగుతోంది. వరసగా జాతీయ నాయకులు వచ్చి బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికలకు మరో ఏడాదిన్నర గడువు ఉండగానే… రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇటీవల రాహుల్ గాంధీ వరంగల్ లో బహిరంగ సభ నిర్వహిస్తే… తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా తుక్కుగూడ లో బహిరంగ సభలో పాల్గొన్నారు. ముఖ్యంగా బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ మధ్య మాటల యుద్ధం చెలరేగుతోంది.…
దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా పతనమౌతోంది. ఇప్పటికే రికార్డు స్థాయి ద్రవ్యోల్బణం హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పుడు రూపాయి విలువ కూడా జీవనకాల కనిష్ఠానికి చేరుకుంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడగుంటుతున్నాయి. స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారుకుంటున్నాయి. మరోవైపు నిరుద్యోగం పెరిగిపోతోంది. ధరల మోత మోగిపోతోంది. ఎక్కడ చూసినా ప్రతికూల సంకేతాలే కనిపిస్తున్నాయి. సామాన్యుడి బతుకు మరింత భారంగా మారే ప్రమాదం పొంచి ఉంది. ఇప్పటికే గ్యాస్, డీజిల్, పెట్రోల్ రేట్లు ఆకాశమే హద్దుగా పరుగులు…
దేశవ్యాప్తంగా RRR సినిమా ప్రభంజనం నడుస్తోంది. తాజాగా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కూడా ఈ సినిమా గురించి ప్రస్తావించారు. భారతదేశ అతిపెద్ద సినిమా RRR సినిమా తొలి ఏడు రోజుల్లో రూ.750 కోట్లు వసూలు చేసినట్లు తాను తెలుసుకున్నానని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ సినిమా రికార్డులు బద్దలు కొట్టిందని.. అలాగే 2021-22 ఆర్థిక సంవత్సరంలో రికార్డ్ స్థాయిలో భారత్ 418 బిలియన్ డాలర్ల ఎగుమతులను చేసిందన్నారు. అంతేకాకుండా RRR సినిమా లాగే ఇండియన్…
ఒక్క యుద్ధం.. యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. గతంలో జరిగిన అనేక యుద్ధాలు ఇదే సంగతి చెప్పాయి. తాజాగా ఉక్రెయిన్ వార్..మన పొరుగుదేశం శ్రీలంకను మరిన్ని కష్టాల్లోకి నెట్టేసింది.ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న లంకను.. చమురు ధరల పెరుగుదల నిలువునా ముంచేసింది. లీటర్ పెట్రోల్ ధర రెండు వందలు దాటింది. నిత్యవసరాల ధరలు … మరింత పెరగడంతో, సామ్యాన్యుడి బతుకు.. దినదినగండంలా మారింది.రష్యా,ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. ఈ పరిణామాలు ఎలాంటి పరిస్థితికి దారి తీస్తాయనే…
హిడెన్ ఛార్జీల పేరుతో బ్యాంకులు కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నాయి. ఉద్యోగాల కోసం, ఉన్నత చదువుల కోసం, వైద్యం కోసం, తమ బంధువుల కోసం, సొంత పర్యటనల చాలా మంది భారతీయులు విదేశాలకు వెళ్తుంటారు. ఆయా దేశాల్లో మన కరెన్సీ చెల్లదు కాబట్టి మన డబ్బును ఇచ్చి ఆయా దేశాల కరెన్సీని తీసుకుంటారు. ఇలా డబ్బును బదిలీ చేసే వారిపై ప్రాసెసింగ్ ఫీజు, మార్కప్ ఫీజుల పేరుతో బ్యాంకులు హిడెన్ ఛార్జీలు వసూలు చేస్తున్నాయంటూ క్యాపిటల్ ఎకానమిక్స్ అనే…
కరోనా వైరస్ ఎప్పుడు ఎవరికి సోకుతుందో తెలియదు.. అంతేకాదు.. దినసరి కూలి నుంచి చిన్న షాపులు, సంస్థలు, పారిశ్రామిక వేత్తలు, ప్రభుత్వాలు, ప్రైవేట్ అనే తేడా లేకుండా అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపింది.. గత ఏడాది ఫస్ట్ వేవ్ వణుకుపుట్టిస్తే.. ఈ ఏడాది సెకండ్ వేవ్ కల్లోలమే సృష్టిస్తోంది.. అయితే.. భారత ఆర్థిక వ్యవస్థపై కోవిడ్ ప్రభావం ఎలా ఉంది? అనే దానిపై వివరాలు వెల్లడించింది భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ).. కరోనా ఫస్ట్ వేవ్…