India's GDP: భారత ఆర్థిక వ్యవస్థ దూసుకు పోతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 జూలై- సెప్టెంబర్ రెండో త్రైమాసికంలో GDP వృద్ధి రేటు 8.2 శాతంగా నమోదైంది. గత త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధి నమోదైంది. గత ఆరు త్రైమాసికాల్లో ఇదే అత్యధికం. గతేడాది ఇదే కాలానికి 5.6 శాతం వృద్ధి రేటు నమోదైంది.
బ్యాంకింగ్ వ్యవస్థలో ఆర్థిక విస్తరణ, వృద్ధి వేగాన్ని బట్టి, త్వరలో మరిన్ని భారతీయ బ్యాంకులు గ్లోబల్ టాప్ 100 జాబితాలో చేరతాయని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), HDFC బ్యాంక్ మాత్రమే ప్రపంచంలోని టాప్ 100 బ్యాంకులలో ఉన్నాయి. ఈ రెండు బ్యాంకులు వరుసగా 43వ, 73వ స్థానంలో ఉన్నాయి. Also Read:India-Paksitan War: డ్రాగన్ గలీజ్ “దందా”.. భారత్-పాక్ ఘర్షణను ఆయుధాల ట్రయల్కి…
పట్టణ ప్రాంతాల్లో సహకార బ్యాంకులు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. కేంద్ర హోం, సహకార మంత్రి అమిత్ షా సోమవారం ఢిల్లీలో నిర్వహించిన ‘కో-ఆప్ కుంభ్’ను ప్రారంభిస్తూ, ఐదు సంవత్సరాలలో, రెండు లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రతి నగరంలో కనీసం ఒక పట్టణ సహకార బ్యాంకును ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. Also Read:Delhi Car Blast Live Updates : 10 మందికి చేరిన మృతుల సంఖ్య.. దేశమంతా హైఅలర్ట్.. రెండు రోజుల అంతర్జాతీయ…
దీపావళి పండుగ వేళ దేశం ఆర్థికంగానూ వెలిగిపోయినట్లు లెక్కలు చెప్తున్నాయి. @CAITIndia రిసెర్చ్ & ట్రేడ్ డెవలప్మెంట్ సొసైటీ నిర్వహించిన జాతీయ స్థాయి సర్వే ప్రకారం, దీపావళి 2025 సీజన్లో భారత్ మొత్తం రూ. 5.40 లక్షల కోట్ల విలువైన వస్తువులు, రూ. 65,000 కోట్ల వ్యాపారాన్ని రికార్డ్ చేసింది. భారత్ లో జరిగే పండుగల్లో ఈ సారి దీపావళి పండుగ సందర్భంగా జరిగిన బిజినెస్ భారత రిటైల్ చరిత్రలో రికార్డ్ సృష్టించింది. సర్వే ఎలా జరిగిందో…
Natural gas: భారత్ జాక్‌పాట్ కొట్టింది. దేశంలో మొదటిసారిగా అండమాన్ సముద్రంలో ‘‘సహజ వాయువు’’ నిక్షేపాలను కనుగొంది. ఆయిల్ ఇండియా లిమిటెడ్ శ్రీ విజయపురం-2 బావి వద్ద గ్యాస్‌ను కనుగొంది. ప్రారంభ టెస్టుల్లో 87 శాతం మీథేన్ ఉన్నట్లు తేలింది. గతంలో ఈ ప్రాంతంతో సంభావ్య చమురు నిక్షేపాలు ఉన్నట్లు తేలింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థను, ఇంధన మార్కెట్‌ను గణనీయంగా మారస్తుంది.
2025 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి 12వ సారి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, మేడ్ ఇన్ ఇండియా, స్వావలంబన భారతదేశం గురించి నొక్కి చెప్పారు. మిషన్ మోడ్‌లో సెమీకండక్టర్లపై పనిచేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. భారతదేశంలోని ప్రజలు తయారు చేసే మేడ్ ఇన్ ఇండియా సెమీకండక్టర్ చిప్‌లు ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్లోకి వస్తాయన్నారు. రాబోయే కాలంలో భారతదేశం సెమీకండక్టర్ల కేంద్రంగా మారుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. 30-40…
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఆఫీసును ప్రారంభించారు. అనంతరం నిజామాబాద్ కిసాన్ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. నిజామాబాద్ పసుపు రైతులు మరింత వృద్ధిలోకి రావాలని ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ మోడీ సర్కార్ బోర్డ్ ఏర్పాటు చేసింది.. మోడీ ఏది చెప్పినా చేసి తీరతారు.. డీఎస్ గొప్ప రాజకీయ నాయకుడు.. ఆయన విగ్రహం ఆవిష్కరణ చేయడం సంతోషంగా ఉంది.. నిజామాబాద్ పసుపు రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే ఓ ప్రత్యేక…
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఆఫీసును ప్రారంభించారు. పసుపు ఉత్పత్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఇవాళ తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. పసుపు రైతులకు ప్రధాని ఇచ్చిన హామీ నెరవేరిందని చెప్పారు. దేశంలోని పసుపు రైతులకు అభినందనలు తెలిపారు. పసుపు బోర్డు వల్ల ప్రపంచంలోని పలు దేశాలకు నిజామాబాద్ పసుపు వెళ్తుందని వెల్లడించారు.
భారత ప్రభుత్వం జీఎస్టీలో విస్తృతమైన మార్పులకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మార్పుల వల్ల సాధారణ ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. చాలా వస్తువులను 12% పన్ను స్లాబ్‌ను తొలగించి, 5% స్లాబ్‌లోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీహార్ పర్యటనలో ఉన్నారు. సివాన్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ఈ వేదిక నుంచి పునాది వేశామని ప్రధాని మోడీ అన్నారు. ఈ అభివృద్ధి ప్రాజెక్టులన్నీ బీహార్‌ను ఉజ్వల భవిష్యత్తు వైపు తీసుకెళ్తాయని ఆశా భావం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులు సాధారణ ప్రజల జీవనాన్ని మెరుగు పరుస్తాయన్నారు. పేదరికాన్ని తగ్గించవచ్చని తాము చూపించామని, ప్రపంచ బ్యాంకు సైతం భారతదేశానికి అభిమానిగా మారిందని మోడీ అన్నారు.