PM Narendra Modi celebrates Diwali with army: సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ, భారత సైనికులతో దీవపాళి వేడుకలను జరుపుకున్నారు. కార్గిల్ సెక్టార్ లో భారత సైనికులతో కలిసి దీపావళిని జరుపుకున్నారు. 2014లో అధికారం చేపట్టిన తర్వాత ప్రతీ దీపావళిని సైనికులతోనే జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సైనికులను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. అధికారం లేకుండా శాంతిని పొందడం అసాధ్యమని సైనికులతో అన్నారు. తమ ప్రభుత్వం యుద్ధాన్ని చివరి ఎంపికగా భావిస్తుందని ప్రధాని అన్నారు.
Sitharaman's ‘rupee not sliding but dollar strengthening’ remark: ఇటీవల కాలంలో రూపాయి విలువ ఎప్పుడూ లేని విధంగా పడిపోతోంది. డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ పడిపోతోంది. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆమె విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. రూపాయి పడిపోవడం లేదని.. డాలర్ బలపడుతోందని ఆమె అన్నారు. ఇది అన్ని దేశాల కరెన్సీపై ప్రభావం చూపిస్తుందని ఆమె అన్నారు. అనేక ఇతర…
Huge Orders to Hyderabad Company: హైదరాబాద్‌లోని MTAR Technologies కంపెనీకి 540 కోట్ల రూపాయల విలువైన ఆర్డర్లు వచ్చాయి. ఈ సంస్థ సివిలియన్ న్యూక్లియర్, డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, స్పేస్, బాల్ స్క్రూలు మరియు రోలర్ స్క్రూలు, మెరైన్ తదితర సెగ్మెంట్లతోపాటు పర్యావరణ అనుకూల ఇంధన విభాగంలో సేవలందిస్తోంది. క్లీన్ ఎనర్జీకి సంబంధించి పెద్ద సంఖ్యలో కొత్త ఆర్డర్లు లభించటంతో రానున్న రోజుల్లో ఈ సెక్టార్‌లో విస్తృత అవకాశాలు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తోంది.
India set to become 3rd largest economy by 2030: ప్రపంచం అంతా మాంద్యం అంచున ఉంటే ఒక్క భారత్ మాత్రమే వృద్ధి రేటులో దూసుకెళ్తోంది. ఇప్పటికే యూకేను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా అవతరించింది ఇండియా. రానున్న కాలంలో మరింత వేగంగా భారత్ ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 2030 నాటికి భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆర్థిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.…
India is the fifth largest economy, UK is sixth: అమెరికా, బ్రిటన్, చైనా ఇలా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న దేశాల పరిస్థితి నెమ్మనెమ్మదిగా దిగజారుతోంది. దీంతో పాటు పలు దేశాలు మాంద్యం పరిస్థితుల్లోకి వెళుతున్నాయి. మరికొన్ని దేశాలు శ్రీలంక పరిస్థితికి దగ్గర్లో ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు ఇలా ఉంటే ఇండియాలో మాత్రం ఆర్థిక మాంద్యం పరిస్థితులు వచ్చే అవకాశం దాదాపుగా ‘సున్నా’ అని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. దీంతో పాటు ఆర్థిక…
భారతదేశం తన 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధమైంది. దేశభక్తి భావన పౌరుల హృదయాలను నింపుతోంది. ఈ చారిత్రాత్మక దినానికి గుర్తుగా అనేక స్మారక చిహ్నాలు, ప్రభుత్వ కార్యాలయాలు త్రివర్ణ పతాకంతో అలంకరించబడ్డాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మొదట న్యూఢిల్లీలోని ఎర్రకోటలో 'తిరంగ'ను ఎగురవేస్తారు.
మన ఎకానమీ ఎంత బలోపేతంగా ఉందో చెప్పే సందర్భమిది. ఈ ఆర్థిక సంవత్సర ప్రథమార్ధంలోనే సంఘటిత రంగంలో 1149 ఒప్పందాలు కుదిరాయి. ఈ డీల్స్ వీటి విలువ ఏకంగా 104.3 బిలియన్ డాలర్లు కావటం విశేషం.
జూన్లో అమెరికా ద్రవ్యోల్బణం 9.1 శాతం అమెరికాలో వినియోగదారుల ధర సూచీ (సీపీఐ) ఇంతకుముందెన్నడూ లేనంతగా పెరిగింది. జూన్ నెలలో తొమ్మిదీ పాయింట్ ఒక శాతానికి శరవేగంగా ఎగబాకింది. ఆహార, చమురు ధరలు కలపకుండానే ఈ ఫలితాలను నమోదుచేసింది. ఇది నాలుగు దశాబ్దాల గరిష్టం కావటం చెప్పుకోదగ్గ విషయం. 1981 డిసెంబర్ తర్వాత ఈ స్థాయిలో దూసుకుపోవటం ఇదే తొలిసారి. యూఎస్లో గతేడాది జూన్లో ద్రవ్యోల్బణం 5.9 శాతం మాత్రమేనని గణాంకాలు చెబుతున్నాయి. నిజానికి ఈ అంచనా…