రోహిత్ శర్మ టెస్ట్ సిరీస్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత.. టీం ఇండియా తదుపరి టెస్ట్ కెప్టెన్ గురించి చర్చలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా.. భారత మాజీ కోచ్ రవిశాస్త్రి, శుభ్‌మాన్ గిల్, రిషబ్ పంత్ భారత టెస్ట్ ఫార్మాట్‌లో కెప్టెన్‌గా ఉండటానికి అనువైన ప్లేయర్‌లు అని అభిప్రాయపడ్డారు. వారి వయసును పరిగణలోకి తీసుకోవడంతో పాటు ఇప్పటికే ఐపీఎల్ జట్లకు కెప్టెన్లుగా ఉన్నారని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో జస్‌ప్రీత్ బుమ్రా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. బుమ్రాను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ సారథిగా నియమించకూడదని యాజమాన్యానికి సూచించారు. యువ ఆటగాడికి పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. వాస్తవానికి టెస్టుల్లో దాదాపు.. 15 ఓవర్లు బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు కెప్టెన్సీ ఒత్తిడి బుమ్రా మానసిక స్థితిని ప్రభావితం చేస్తుందని రవిశాస్త్రి అన్నారు.
READ MORE: JR NTR : రాజమౌళి అడగలేదు.. అమీర్ ఖాన్ కు ఓకే చెప్పా : ఫాల్కే మనవడు
కాగా.. సిడ్నీలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఫైనల్లో బుమ్రా వెన్ను నొప్పితో బాధపడ్డాడు. దీని వలన జనవరి నుంచి ఏప్రిల్ వరకు దాదాపు మూడు నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. భారత ఛాంపియన్స్ ట్రోఫీ విజేత జట్టులో భాగం అయ్యే అవకాశం కోల్పోయాడు. అయితే.. బుమ్రా తిరిగి ఐపీఎల్‌కి వచ్చాడు. ముంబై ఇండియన్స్ తరఫున ఎనిమిది మ్యాచ్‌ల్లో 13 వికెట్లు పడగొట్టాడు.
READ MORE: India Pakistan: 600కి పైగా పాక్ డ్రోన్లను కూల్చిన భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్..