శనివారం నాగాలాండ్‌లోని మాన్ జిల్లాలో జరిగిన ఆర్మీ ఆపరేషన్ లో పద్నాలుగు మంది పౌరులు చనిపోయారు. తీవ్రవాదులు జాడ గురించి సమాచారం అందటంతో ప్రత్యేక బలగాలు ఈ చర్యకు దిగాయి. కాని, వారు దాడి చేసింది ఉగ్రవాదులపై కాదు..సామాన్య పౌరులు ప్రయాణిస్తున్న వాహనంపై. ఐతే, ఇది పొరపాటున జరిగిందా, నిర్లక్ష్యం వల్ల జరిగిందా అనేది దర్యాప్తులో తేలాల్సి వుంది. మరోవైపు, ఈ సంఘటనను నిరసిస్తూ స్థానికంగా ఆందోళనలు ఎగిసిపడుతున్నాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాబోవు రోజులలో ఎలా…
నాగాలాండ్‌లో తీవ్రవాదులు అనుకుని పౌరులపైకి భద్రతా బలగాలు కాల్పులు జరిపిన ఘటనలో 17 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్రకలకలం రేపుతున్న నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ తగుచర్యలు చేపట్టింది. దీనిపై నివేదిక ఇవ్వాలని భారత సైన్యం కోర్టు ఆఫ్ ఎంక్వైరీని ఏర్పాటు చేసింది. ఈశాన్య రాష్ట్రాలలో పనిచేసే ఓ మేజర్ ఈ విచారణకు సారథ్యం వహిస్తారని ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. ఈ ఘటనలో గ్రామస్తుల మృతదేహాలను గుర్తించిన యువకులు… ఆవేశం చెంది…
నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయనే పక్కా సమాచారంతో భారత జవాన్లు మోన్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు చర్యలు చేపడుతున్న సమయంలో సామాన్య పౌరులను చూసి మిలిటెంట్లుగా భావించి వారిపై జవానులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 13 మంది పౌరులు మృతి చెందగా, 11 మందికి గాయాలయ్యాయి. ఓటింగ్ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. బొగ్గుగనిలో విధులు ముగించుకొని తిరిగి వస్తున్న కార్మికులను చూసి…
శీతాకాలంలో హిమాలయా పరివాహ ప్రాంతాల్లో ఎముకలు కొరికే చలి ఉంటుంది. ఆ చలిని తట్టుకొని బోర్డర్‌లో సైనికులు పహారా నిర్వహించాలి అంటే చాలా కష్టంతో కూడుకున్నది. ఒకటి రెండు రోజులు కాదు… నెలల తరబడి గడ్డగట్టే మంచులో చలిని తట్టుకొని నిలబడాలి. శతృవులను ధీటుగా ఎదుర్కొనాలి. Read: ఇకపై హాస్టళ్లలో పిల్లలకు తోడుగా తల్లలు… అయితే, గతానికిపూర్తి భిన్నంగా లద్ధాఖ్‌లో పరిస్థితులు నెలకొన్నాయి. ఇండో – చైనా బోర్డర్ లో పరిస్థితులు భిన్నంగా మారిపోయాయి. బోర్డర్‌లో చైనా…
ఇండియా, యునైటెడ్ స్టేట్స్ నుంచి 30 ప్రిడేటర్ డ్రోన్‌లను కొనుగోలు చేయడానికి సంబంధించిన ఒప్పందం పై నేడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వీటి ధర సుమారు రూ. 21,000 కోట్లుగా అంచనా వేస్తున్నారు. దీనిపై చర్చించేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనుంది. సీనియర్ అధికారులు పాల్గొనే సమావేశానికి రక్షణ కార్యదర్శి అధ్యక్షత వహి స్తారని రక్షణ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ సమా వేశంలో వీటి కొనుగోలుకు ఆమోదం పొందినట్లయితే,…
అరుణా చల్ ప్రదేశ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి చైనా ఓగ్రామం నిర్మించిందంటూ అమెరికా ఇటీవల ఓ నివేదికను విడుదల చేసిన విషయం తెల్సిందే. సరిహద్దుల్లో చైనా పెద్ద ఎత్తున మౌలిక సదు పాయాలు అభివృద్ధి చేస్తున్నట్లు ఆ నివేదికలో పేర్కొంది. అయితే తాజాగా ఈ నివేదిక పై భారత సైనిక వర్గాలు స్పందించాయి. ఆ గ్రామం చైనా నియంత్ర ఉన్న ప్రాంతంలోనే ఉన్నట్టు భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. ఎగువ సుబాన్‌సిరి జిల్లాలో వివాదాస్పద సరిహద్దు వెంబడి…
దేశ ప్రజల ముఖాల్లో వెలుగు చూడాలని ఆ జవాన్ తాపత్రయం.. దేశ ప్రజలకు వెలుగులు పంచుతూ దీపావళి రోజే ప్రకృతి ప్రకోపానికి బలి కావడంతో ఆ కుటుంబంలో చీకట్లు అలముకున్నాయి. ఎప్పుడూ దేశ సేవ కోరేవాడని, ఆ క్రమంలోనే లక్ష్యాన్ని నిర్దేశించుకొని సైనికుడిగా చేరి విధులు నిర్వహిస్తుండగానే అసువులు బాశారు ములకలచెరువు మండలం వేపూరికోట పంచాయతీ బంగారువాండ్లపల్లెకు చెందిన పెద్దావుల కార్తీక్‌కుమార్‌రెడ్డి. కార్తీక్ వయసు 29 ఏళ్ళు. గురువారం సాయంత్రం హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రం మనాలి సమీపంలో మంచుకొండలు…
మొన్న లద్దాక్..నేడు తవాంగ్ ప్రాంతాల్లో చైనా సైన్యాన్ని మోహరిస్తుంది. దీంతో చైనా దూకుడుకు చెక్ పెట్టేందుకు చైనా సరిహద్దుల్లో భారీ బందోబస్త్‌ను భారత్ ఏర్పాటు చేస్తోంది. గత ఏడాది కాలంగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గకపోవడంతో భారత్ భూటాన్, టిబెట్‌లకు ఆనుకుని ఉన్న తవాంగ్ ప్రాంతం పై చైనా కన్ను పడింది. ఎలాగైనా ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని దురుద్దేశపూర్వకంగా అక్కడి ప్రాంతాల్లో సైన్యాన్ని మోహరిస్తుంది. దీంతో చైనాకు ధీటుగా జవాబు చెప్పేందుకు అమెరికా తయారు చేసినా…
లద్దాఖ్‌లోని గల్వాన్ ఘటన తరువాత భారత ప్రభుత్వం సైనికుల కోసం అధునాతనమైన ఆయుధాలను సమకూర్చడం మొదలు పెట్టింది. ఇండియా చైనా బోర్డర్‌లో ఇరు దేశాల సైనికులు ఆయుధాలతో పహరా నిర్వహించకూడదు అనే ఒప్పందం ఉన్నది. అయితే, ఆ ఒప్పందానికి చైనా తూట్లు పొడిచి ఈటెలు, ముళ్ల వంటి ఆయుధాలతో గల్వాన్‌లో భారత్ సైనికులపై దాడి చేసింది. అయితే, ఆ దాడిని భారత సైనికులు ఒంటిచేత్తో తిప్పికొట్టారు. ఆ దాడిలో భారత్ 20 మంది సైనికులను కోల్పోగా, చైనా…