పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవి కోల్పోయే ప్రమాదం ఉన్న ఆయన భారత ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. ఖైబర్ ఫక్తూన్వాలో ఓ కార్యక్రమానికి హాజరైన ఇమ్రాన్ ఖాన్.. భారత ఆర్మీ భేషుగ్గా పని చేస్తుందని మెచ్చుకున్నారు. భారత ఆర్మీ.. అక్కడి ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోదన్నారు. ఇక భారత్.. ఏ ఒత్తిళ్లకూ తలొగ్గని దేశమని, విధానాలు సక్రమంగా ఉండటం వల్లే తటస్థ వైఖరి అవలంభిస్తుందంటూ వ్యాఖ్యానించారు. ఇక, భారత్ ఎప్పుడూ స్వతంత్ర విదేశాంగ…
ఇప్పుడు ప్రపంచమంతటా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఆయన స్టయిలే వేరంటున్నారు. పుతిన్ మాటలకు అర్థాలే వేరు?పుతిన్ యస్ అన్నాడంటే..అది నో….నో అన్నాడంటే అది పక్కా ఎస్. మాట ఒకటి…చేత ఇంకోటి. మొన్న క్రిమియాపై అదే బాట. ఆ తర్వాత డాన్ బాస్ పై అదే పాట. ఉక్రెయిన్ వార్ పై అదే తీరు. ఇప్పుడు లేటెస్టుగా ఆయన నోటి నుంచి జాలువారిన మరో డైలాగ్ బాంబ్, అణ్వస్త్ర సంసిద్ధత. మరి రష్యా అధ్యక్షుడి…
బెంగళూరులోని నందిహిల్స్ ప్రాంతం గురించి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. నంది హీల్స్ ట్రెక్కింగ్ చేసేందుకు అనువుగా ఉంటుంది. నంది హిల్స్ ప్రాంతంలో నిత్యం వందలాది మంది ట్రెక్కింగ్ చేస్తుంటారు. దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో ట్రెక్కింగ్ కోసం వస్తుంటారు. ఇదేవిధంగా ఢిల్లీకి చెందిన 19 ఏళ్ల నిశాంక్ శర్మ అనే యువకుడు నంది హిల్స్‌కు ట్రెక్కంగ్ కోసం వచ్చాడు. అయితే, అనుకోని విధంగా కొండపైనుంచి దొర్లి 300 అడుగుల కిందకు పడిపోయాడు. భూమిపై ఇంకా నూకలు…
ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్‌కు నిరసన సెగ తగిలింది.. ఇవాళ గోండా జిల్లాలో జరిగిన బహిరంగ సభలో రాజ్‌నాథ్ సింగ్ ప్రసంగిస్తుండగా.. కొందరు యువకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.. వెంటనే ఆర్మీ రిక్రూట్‌మెంట్ ప్రారంభించాలని డిమాండ్ చేశారు.. ఇక, యువత నిరసనపై స్పందించిన రాజ్‌నాథ్ సింద్.. న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చి శాంతింపజేశారు.. మరోవైపు ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే హోళీ, దీపావళి పండుగలకు ఉచితంగా ఎల్పీజీ గ్యాస్…
దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టి నిత్యం బోర్డర్ లో పహారా కాస్తుంటారు సైనికులు. మంచు పర్వతాల్లో ప్రాణాలకు తెగించి పహారా చేయడం అంటే మామూలు విషయం కాదు. పైనుంచి దట్టంగా కురిసే మంచుతో ఆ ప్రాంతాలన్ని కప్పబడి ఉంటాయి. మంచులో నడుస్తుంటే కాళ్లు మోకాళ్ల లోతులో కూరుకుపోతుంటాయి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రాణాలు పోయినా సరే దేశంకోసం జవాన్లు కాపలా కాస్తుంటారు. శతృవుల నుంచి దేశాన్ని రక్షిస్తుంటారు. అత్యంత కఠోరమైన వాతావరణంలో సైతం విధులు నిర్వహిస్తూ…
సర్జికల్ స్ట్రయిక్స్‌కు సాక్ష్యమేదీ? అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశ్నించడంపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు బీజేపీ నేతలు.. తెలంగాణ బీజేపీ నేతలతో పాటు.. ఇతర రాష్ట్రాల వారు కూడా కేసీఆర్‌ను టార్గెట్ చేస్తున్నారు.. ఈ వ్యవహారంపై స్పందించిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ… డియర్ కేసీఆర్, ఇదిగో మన వీర సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్ వీడియోగ్రాఫిక్ సాక్ష్యం అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు.. అయినప్పటికీ మీరు సాయుధ బలగాల…
ఈశాన్యరాష్ట్రాల్లోని ప్రజలకు అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయనే సంగతి అందరికీ తెలిసిందే. దీంతో అక్కడ నివశించే ప్రజలు పనుల కోసం, ఉద్యోగాల కోసం మైదాన ప్రాంతాలకు వస్తుంటారు. కాయాకష్టం చేసి జీవనాన్ని వెళ్లదీస్తుంటారు. కొంతమంది ఉన్న ఊర్లోనే ఉంటూ దొరికిన పనిచేసుకుంటూ అక్కడే జీవనం సాగిస్తుంటారు. ఇదే ఆ గ్రామంలోని కొన్ని కుటుంబాలకు కలిసివచ్చింది. రాత్రికి రాత్రే వారిని కోటీశ్వరుల్ని చేసింది. రాత్రికి రాత్రే అంటే వారికేమి నిధులు, నిక్షేపాలు దొరకలేదు. ప్రభుత్వం నుంచే వారికి భారీ…
జమ్ముకశ్మీర్‌లోని సాంబా సరిహద్దులో పాకిస్థాన్ చొరబాటు దారుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. తాజాగా దేశంలోకి అక్రమంగా చొరబడుతున్న ముగ్గురు పాక్ స్మగ్లర్లను బీఎస్ఎఫ్ బలగాలు మట్టుబెట్టాయి. వారి నుంచి 36 కిలోల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని భద్రతాధికారులు తెలిపారు. జమ్ముకశ్మీర్‌లో సరిహద్దుల ద్వారా ముగ్గురు పాకిస్థానీ స్మగ్లర్లు చొరబడుతుండగా భద్రతా దళాలు వారిని హతమార్చాయి. హతులు ముగ్గురినించి 36 ప్యాకెట్ల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నట్లు బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. భారత్‌లోకి చొరబడుతున్న ముగ్గురిని ఆదివారం తెల్లవారుజామున 2.30…
అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన మిరామ్ తరోన్ అనే 17 ఏళ్ల బాలుడి కథ సుఖాంతం అయింది. తరోన్ ని ఎట్టకేలకు చైనా బలగాలు భారత సైన్యానికి అప్పగించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎగువ సియాంగ్ జిల్లాకు చెందిన 17 ఏళ్ళ బాలుడు తరోన్ ఈ నెల 19 నుంచి కనిపించకుండా పోయాడు. ఇటీవల చైనా బలగాలు తరోన్ ను అదుపులోకి తీసుకున్నట్టు ప్రకటించాయి. అరుణాచల్ ప్రదేశ్ ఎంపీ తాపిర్ దీనిపై స్పందించారు. సరిహద్దు ప్రాంతంలో మూలికల…
డ్రాగన్ కంట్రీ చైనాకు పరోక్షంగా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణె… సైనిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశాల సరిహద్దుల వద్ద యథాతథ స్ధితిని ఏకపక్షంగా మార్చే ఏ ప్రయత్నాన్ని కూడా భారత సైన్యం సఫలం కానివ్వబోదని ప్రకటించారు.. చైనా సరిహద్దుల్లో ఉన్న పరిస్థితిని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. గత ఏడాది భారత సైన్యం తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొందన్నారు.. తూర్పు లద్దాఖ్‌లో పరిస్థితులను నియంత్రణలో…