దేశ రక్షణే వారికి ప్రాణం. తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి మరీ సరిహద్దుల్ని ఉగ్రమూకల నుంచి కాపాడుతున్నారు. కాశ్మీర్ బోర్డర్ లో తీవ్రంగా మంచు తుఫాను కురుస్తోంది. తన ప్రాణాలకు తెగించి మరీ గస్తీ కాస్తున్నారు భారత జవాన్. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శత్రువుల కంటే ఈ మంచే పెద్ద శత్రువుగా విరుచుకుపడుతోంది. అయినా అలుపెరుగక, దేశ రక్షణకు అంకితం అవుతున్న ఇలాంటి భరత మాత ముద్దుబిడ్డలకు ఎన్టీవీ సలాం చేస్తోంది.…
కాశ్మీర్ లో మరోసారి ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఉగ్రవాదాలు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఆదివారం ఉదయం తెల్లవారు జామున ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమచారంతో భద్రతా బలగాలు గాలింపు చేస్తున్న సమయంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు శ్రీనగర్ శివార్లలోని హర్వాన్ ప్రాంతంలో ఎన్ కౌంటర్ చోటు చేసుకుందని… ఇందులో ఒక ఉగ్రవాదిని హతమార్చామని కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.…
ఇటీవలే తమిళనాడు కూనూరు హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన ల్యాన్స్ నాయక్ సాయితేజ అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో ముగిశాయి. సాయితేజ సొంత గ్రామమైన చిత్తూరు జిల్లా ఎగువరేగడ గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. సాయితేజకు నివాళులు అర్పించేందుకు గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సాయితేజ పార్ధీవదేహాన్నిచూసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. సాయితేజ భౌతికకాయం చూసి ఆయన భార్య సొమ్మసిల్లిపడిపోయింది. Read: అమెరికా చరిత్రలో అతిపెద్ద విపత్తు… జోబైడెన్ పర్యటన షురూ… సాయితేజ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు.…
సీడీఎస్ బిపిన్ రావత్‌కు 17 తుపాకుల వందనం సమర్పిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. తుపాకుల వందనాల్లో అనేక రకాలు ఉన్నాయి. 21 తుపాకుల వందనం, 19 తుపాకుల వందనం, 17 తుపాకుల వందనం వంటివి అనేక రాకాలు ఉంటాయి. వివిధ సందర్బాలను బట్టి, గౌరవాన్ని బట్టి ఈ తుపాకుల వందనం ఉంటుంది. స్వాతంత్య్రదినోత్సవం, గణతంత్ర దినోత్సవంలో 21 తుపాకుల వందనాన్ని సమర్పిస్తారు. వీటి కోసం తుపాకులు లేదా శతఘ్నలను వినియోగిస్తారు. వివిధ దేశాలకు చెందిన అధ్యక్షులు మనదేశానికి…
భారత్‌లో అత్యంత శక్తివంతమైన సైనికాధికారి బిపిన్ రావత్ ఈరోజు మధ్యాహ్నం హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు. ఉదయం ఢిల్లి నుంచి తమిళనాడులోని వెల్లింగ్టన్ ఆర్మీ కళాశాలకు వెళ్తున్న సమయంలో కూనూరు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక, మరో 11 మంది సైనికులు మృతి చెందారు. ఉత్తరాఖండ్‌లోని పౌరీ జిల్లాలో జన్మించిన బిపిన్ రావత్ ప్రాథమిక విద్యను డెహ్రడూన్, సిమ్లాలో పూర్తిచేశారు. తండ్రి ఇచ్చిన స్పూర్తితో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో…
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ బిపిన్ రావత్ కన్నుమూశారు. ఈరోజు కనూరులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో బిపిన్ రావత్ మృతి చెందినట్టు ఇండియన్ ఆర్మీ ధృవీకరించింది. ఉటీ సమీపంలోని వెల్డింగ్టన్ డిఫెన్స్ కాలేజీలో లెక్చర్ ఇచ్చేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సూలూరు ఎయిర్ బేస్ కు చేరుకున్నారు. సూలూరు ఎయిర్ బేస్ నుంచి ఎంఐ 17 హెలికాప్టర్లో వెల్టింగ్టన్ కు బయలుదేరి వెళ్లారు. వెల్డింగ్టన్కు 16 కిలోమీటర్ల దూరంలో హఠాత్తుగా హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో…
శనివారం నాగాలాండ్‌లోని మాన్ జిల్లాలో జరిగిన ఆర్మీ ఆపరేషన్ లో పద్నాలుగు మంది పౌరులు చనిపోయారు. తీవ్రవాదులు జాడ గురించి సమాచారం అందటంతో ప్రత్యేక బలగాలు ఈ చర్యకు దిగాయి. కాని, వారు దాడి చేసింది ఉగ్రవాదులపై కాదు..సామాన్య పౌరులు ప్రయాణిస్తున్న వాహనంపై. ఐతే, ఇది పొరపాటున జరిగిందా, నిర్లక్ష్యం వల్ల జరిగిందా అనేది దర్యాప్తులో తేలాల్సి వుంది. మరోవైపు, ఈ సంఘటనను నిరసిస్తూ స్థానికంగా ఆందోళనలు ఎగిసిపడుతున్నాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాబోవు రోజులలో ఎలా…
నాగాలాండ్‌లో తీవ్రవాదులు అనుకుని పౌరులపైకి భద్రతా బలగాలు కాల్పులు జరిపిన ఘటనలో 17 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్రకలకలం రేపుతున్న నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ తగుచర్యలు చేపట్టింది. దీనిపై నివేదిక ఇవ్వాలని భారత సైన్యం కోర్టు ఆఫ్ ఎంక్వైరీని ఏర్పాటు చేసింది. ఈశాన్య రాష్ట్రాలలో పనిచేసే ఓ మేజర్ ఈ విచారణకు సారథ్యం వహిస్తారని ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. ఈ ఘటనలో గ్రామస్తుల మృతదేహాలను గుర్తించిన యువకులు… ఆవేశం చెంది…
నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయనే పక్కా సమాచారంతో భారత జవాన్లు మోన్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు చర్యలు చేపడుతున్న సమయంలో సామాన్య పౌరులను చూసి మిలిటెంట్లుగా భావించి వారిపై జవానులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 13 మంది పౌరులు మృతి చెందగా, 11 మందికి గాయాలయ్యాయి. ఓటింగ్ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. బొగ్గుగనిలో విధులు ముగించుకొని తిరిగి వస్తున్న కార్మికులను చూసి…