శీతాకాలంలో హిమాలయ సరిహద్దుల్లో పహారా నిర్వహించడం సైనికులను కత్తిపై సామువంటిదని చెప్పాలి. సుమారు మైనస్ 40 డిగ్రీల ఉష్ణోగ్రతలను తట్టుకొని నిలబడాలి. ఇది అంత సులభమైన విషయం కాదు. శరీరానికి వేడిని కలిగించే దుస్తులు, హీటర్ల అవసరం ఎంతైనా ఉంటుంది. శీతాకాలంలో కనీసం ఆరునెలలపాటు అన్ని రకాల వాతారవణ పరిస్థితులను తట్టుకొని పహారా కాయడమే కాకుండా, మంచులో సైతం శతృవులను భయపెట్టే ఆయుధాలను క్యారీ చేయాల్సి ఉంటుంది. మందుగుండు సామాగ్రిని భద్రపరిచేందుకు కట్టుదిట్టమైన బంకర్ల అవసరం ఉంటుంది.
Read: మంత్రి పదవి కోసం పద్మా దేవేందర్ రెడ్డి ఆరాటం !
ఇప్పటికే చైనా తూర్పు లద్ధాఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్ వరకు వీలుదొరికినప్పుడల్లా అలజడి సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. ఈ ప్రయత్నాలను సైనికులు ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలి. శతృవులకు ఎంతమాత్రం అవకాశం ఇవ్వకూడదు. బోర్డర్‌లో నిరంతరం విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు. దీనికోసం ప్రభుత్వం సుమారు రూ.738 కోట్ల రూపాయలను ఖర్చుచేసింది. బలమైన ఆహారం, దుస్తులు ఇలా ఒక్కో సైనికుడికి 80 రకాల వస్తువులను అందించాలి. అత్యంత ఎత్తైన పర్వత ప్రాంతాల్లోకి ఆహారం, ఆయుధాలను తీసుకెళ్లాలి అంటే వైమానిక విమానాల అవసరం ఉంటుంది. సీ 17 విమానంలో వీటిని తరలిస్తుంటారు. ఈ విమానం ప్రయాణానికి గంటకు రూ.2.5 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. శీతాకాలంలో చైనా ఎలాంటి కుతంత్రాలు చేసినా దానిని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామని ఇండియా ఆర్మీ చెబుతున్నది.