ఇండియా, యునైటెడ్ స్టేట్స్ నుంచి 30 ప్రిడేటర్ డ్రోన్‌లను కొనుగోలు చేయడానికి సంబంధించిన ఒప్పందం పై నేడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వీటి ధర సుమారు రూ. 21,000 కోట్లుగా అంచనా వేస్తున్నారు. దీనిపై చర్చించేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనుంది. సీనియర్ అధికారులు పాల్గొనే సమావేశానికి రక్షణ కార్యదర్శి అధ్యక్షత వహి స్తారని రక్షణ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ సమా వేశంలో వీటి కొనుగోలుకు ఆమోదం పొందినట్లయితే, అది రక్షణ మం త్రి నేతృత్వంలోని డిఫెన్స్ అక్వీజీషన్ కౌన్సిల్‌కు పంపబడుతుంది. ఒప్పందంపై సంతకం చేయడానికి ముందు తుది ఆమోదం తెలి పేందుకు క్యాబినెట్ కమిటీకి పంపబడుతుంది. ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. డ్రోన్‌లు అధునాతన వ్యవస్థలు, ఆయుధాల ప్యాకే జీలతో వస్తాయన్నారు.దీర్ఘ-శ్రేణి నిఘా, ఖచ్చితమైన దాడులను చేయగట సామర్థ్యం వీటికి ఉందని తెలిపారు.
భారతదేశం డ్రోన్ జాబితాలో MQ-9B సీగార్డియన్/స్కైగార్డియన్ వేరియంట్‌లు ఉన్నాయి. ఒక వేళ ఈ డీల్ కుదురితే భారత సైన్యం, నావికాదళం, వైమానిక దళం ఒక్కొక్కటి కస్టమైజ్డ్ స్పెసీఫికేషన్లతో 10 డ్రోన్‌లను పొందవచ్చని వారు తెలిపారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో నిఘా కోసం గత ఏడాది అమెరికా నుంచి లీజుకు తీసుకున్న రెండు నిరాయుధ సీగార్డియన్ డ్రోన్‌లను భారత నావికాదళం ఇప్పటికే ఉపయోగిస్తోంది.
ఆయుధ వ్యవస్థలను లీజుకు తీసుకునే ఎంపిక డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ 2020, డిఫెన్స్ ప్రొక్యూర్‌మెంట్ మాన్యువల్ 2009 రక్షణ శాఖకు కల్పించింది. లీజుకు తీసుకోవడమా కొనుగోలు చేయడమా అనే దానిపై సందిగ్ధతపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. గత కొన్నేళ్లుగా భారత సాయుధ దళాలు నిఘా అవసరాల కోసం అమె రికా వ్యవస్థలపై ఆధారపడుతున్నాయి. భారత నావికాదళం ఇప్ప టికే తొమ్మిది P-8I దీర్ఘ-శ్రేణి నిఘా విమానాలను ఉపయోగిస్తోంది. ఈ డీల్ కుదిరితే రాబోయే మరికొన్ని ఏళ్లలో డ్రోన్‌లతో పాటు మరో 9 విమానా లను పొందవచ్చని రక్షణ శాఖ నిపుణులు భావిస్తున్నారు.