శీతాకాలంలో హిమాలయా పరివాహ ప్రాంతాల్లో ఎముకలు కొరికే చలి ఉంటుంది. ఆ చలిని తట్టుకొని బోర్డర్‌లో సైనికులు పహారా నిర్వహించాలి అంటే చాలా కష్టంతో కూడుకున్నది. ఒకటి రెండు రోజులు కాదు… నెలల తరబడి గడ్డగట్టే మంచులో చలిని తట్టుకొని నిలబడాలి. శతృవులను ధీటుగా ఎదుర్కొనాలి.
Read: ఇకపై హాస్టళ్లలో పిల్లలకు తోడుగా తల్లలు…
అయితే, గతానికిపూర్తి భిన్నంగా లద్ధాఖ్‌లో పరిస్థితులు నెలకొన్నాయి. ఇండో – చైనా బోర్డర్ లో పరిస్థితులు భిన్నంగా మారిపోయాయి. బోర్డర్‌లో చైనా దూకుడుగా వ్యవహరిస్తోంది. తూర్పు లద్ధాఖ్‌లో గతంలో చైనా ఆర్మీ నుంచి సవాళ్లు ఎదురవుతున్నాయి. దీనికి తగ్గట్టుగా వ్యవహరించేందుకు ఇండియన్ ఆర్మీ సిద్ధం అయింది. చైనా బోర్డర్‌లో పహారా నిర్వహించే సైనికులకు కావాల్సిన అన్ని వసతులను ఏర్పాటు చేసింది. ఆర్మీకి తోడుగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తోడుగా నిలిచింది. ఇండియన్ ఆర్మీతో పాటుగా ఎయిర్‌ఫోర్స్ విన్యాసాలు నిర్వహించింది.