ఇటీవలే తమిళనాడు కూనూరు హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన ల్యాన్స్ నాయక్ సాయితేజ అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో ముగిశాయి. సాయితేజ సొంత గ్రామమైన చిత్తూరు జిల్లా ఎగువరేగడ గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. సాయితేజకు నివాళులు అర్పించేందుకు గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సాయితేజ పార్ధీవదేహాన్నిచూసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. సాయితేజ భౌతికకాయం చూసి ఆయన భార్య సొమ్మసిల్లిపడిపోయింది.
Read: అమెరికా చరిత్రలో అతిపెద్ద విపత్తు… జోబైడెన్ పర్యటన షురూ…
సాయితేజ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. అశ్రునయనాల మధ్య సాయితేజ అంత్యక్రయిలు పూర్తయ్యాయి. తమిళనాడులోని సల్లూరు ఎయిర్‌బేస్ నుంచి వెల్లింగ్టన్ లోని ఆర్మీ కాలేజీకి ఎంఐ హెలికాప్టర్‌లో సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక, 11 మందిసైనికాధికారులు ప్రయాణం చేస్తుండగా కూనూరు వద్ద హెలికాప్టర్ ప్రమాదానికి గురై కూలిపోయింది. ఈ ప్రమాదంలో బిపిన్‌రావత్ తో సహా 12 మంది మృతి చెందారు.