సీడీఎస్ బిపిన్ రావత్‌కు 17 తుపాకుల వందనం సమర్పిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. తుపాకుల వందనాల్లో అనేక రకాలు ఉన్నాయి. 21 తుపాకుల వందనం, 19 తుపాకుల వందనం, 17 తుపాకుల వందనం వంటివి అనేక రాకాలు ఉంటాయి. వివిధ సందర్బాలను బట్టి, గౌరవాన్ని బట్టి ఈ తుపాకుల వందనం ఉంటుంది. స్వాతంత్య్రదినోత్సవం, గణతంత్ర దినోత్సవంలో 21 తుపాకుల వందనాన్ని సమర్పిస్తారు. వీటి కోసం తుపాకులు లేదా శతఘ్నలను వినియోగిస్తారు. వివిధ దేశాలకు చెందిన అధ్యక్షులు మనదేశానికి వచ్చిన సమయంలో కూడా వారి గౌరవార్థం 21 తుపాకుల వందనం సమర్పిస్తారు.
Read: ఎల్లుండి మంగళగిరిలో పవన్ కళ్యాణ్ దీక్ష…
అంతేకాదు, త్రివిధ దళాధిపతులకు 17 తుపాకుల వందనం సమర్పిస్తుంటారు. సీడీఎస్ బిపిన్ రావత్ ఫోర్ స్టార్ జనరల్. ఆర్మీ, ఎయిర్‌పోర్స్, నేవీ చీఫ్‌లతో సమానమైన ర్యాంక్. ఈ ముగ్గురిలోనూ ప్రధముడిగా సీడీఎస్ ను పేర్కొంటారు. ఈ ర్యాంక్ అధికారులకు 17 తుపాకుల వందనం సమర్పిస్తారు. ఈ సంప్రదాయం 16 శతాబ్దం నుంచి అమలులో ఉంది. బ్రిటీష్ పాలకుల పరిపాలనలో కొనసాగిన కామన్వెల్త్ దేశాలు ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాయి.