దేశ రక్షణే వారికి ప్రాణం. తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి మరీ సరిహద్దుల్ని ఉగ్రమూకల నుంచి కాపాడుతున్నారు. కాశ్మీర్ బోర్డర్ లో తీవ్రంగా మంచు తుఫాను కురుస్తోంది. తన ప్రాణాలకు తెగించి మరీ గస్తీ కాస్తున్నారు భారత జవాన్. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శత్రువుల కంటే ఈ మంచే పెద్ద శత్రువుగా విరుచుకుపడుతోంది. అయినా అలుపెరుగక, దేశ రక్షణకు అంకితం అవుతున్న ఇలాంటి భరత మాత ముద్దుబిడ్డలకు ఎన్టీవీ సలాం చేస్తోంది. మీ సేవలు నిరుపమానం. మీ త్యాగాలు చిరస్మరణీయం. యావత్ భారత జాతి మీకు రుణపడి వుంటుంది.