ఈశాన్యరాష్ట్రాల్లోని ప్రజలకు అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయనే సంగతి అందరికీ తెలిసిందే. దీంతో అక్కడ నివశించే ప్రజలు పనుల కోసం, ఉద్యోగాల కోసం మైదాన ప్రాంతాలకు వస్తుంటారు. కాయాకష్టం చేసి జీవనాన్ని వెళ్లదీస్తుంటారు. కొంతమంది ఉన్న ఊర్లోనే ఉంటూ దొరికిన పనిచేసుకుంటూ అక్కడే జీవనం సాగిస్తుంటారు. ఇదే ఆ గ్రామంలోని కొన్ని కుటుంబాలకు కలిసివచ్చింది. రాత్రికి రాత్రే వారిని కోటీశ్వరుల్ని చేసింది. రాత్రికి రాత్రే అంటే వారికేమి నిధులు, నిక్షేపాలు దొరకలేదు. ప్రభుత్వం నుంచే వారికి భారీ సాయం అందింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ ప్రాంతం ప్రకృతికి నిలయం. అంతేకాదు, ఈ తవాంగ్ ప్రాంతంలో బొంజా అనే చిన్న గ్రామం ఉంది. ఈ గ్రామంలో కొన్ని కుటుంబాలు నివశిస్తున్నాయి. వీరికి కొంత భూమి ఉన్నది. ఈ భూమే వారిని కోటీశ్వరుల్ని చేసింది.
Read: సరికొత్త సోలార్ ప్యానల్స్: సూర్యుడి గమనాన్ని అనుసరించి…
ఈ గ్రామంలో ఇండియన్ ఆర్మీ కొన్ని నిర్మాణాలను నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. ఇండియన్ ఆర్మీ నివశించేందుకు గృహాలను నిర్మించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనికోసం కేంద్రం రూ. 200.056 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఇండియన్ ఆర్మీ గృహాల నిర్మాణం కోసం బోంజా గ్రామంలో భూమిని సేకరించింది అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం. మొత్తం 31 కుటుంబాలకు చెందిన భూమిని సేకరించారు. ఈ 31 కుటుంబాలకు కేంద్రం నష్టపరిహారం కింద రూ. 40.8 కోట్ల రూపాలయను మంజూరు చేసింది. నష్టపరిహారానికి చెందని చెక్కులను ఆరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఫెమా ఖండూ ఆయా కుటుంబాలకు అందజేశారు. ఒక్కో కుటుంబానికి కోటి రూపాయలకు పైగా నష్టపరిహారం అందింది. నష్టపరిహారం కింద కోటి రూపాయలకు పైగా సొమ్ము అందడంతో ఆయా కుటుంబాలు సంతోషాన్ని వ్యక్తం చేశాయి.