Gujarat: మృత్యుంజయుడు.. బోరుబావిలో పడిపోయిన బాలుడిని రక్షించిన ఆర్మీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బోరు బావుల్లో ప్రమాదవశాత్తు పడి మరణించిన ఉదంతాలు ఎన్నో చూశాం. మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది బోరుబావిలో పడి చనిపోయిన ఘటనలు జరిగాయి. ఆడుకుంటూ వెళ్లి తెరిచి ఉన్న బోరు బావుల్లో పడి మరణించారు. ఎంత ప్రయత్నం చేసినా ఈ ఉదంతాల్లో మరణించిన వారే ఎక్కువ. అతి తక్కువ శాతం మంది బతికి బయటపడి మృత్యుంజయులుగా నిలుస్తున్నారు.
తాజాగా ఇలాంటి ఘటనే గుజరాత్ లో జరిగింది. కానీ ఇండియన్ ఆర్మీ రెస్క్యూ చేయడంతో 18 నెలల బాలుడు మృత్యుంజయుడిగా నిలిచాడు. ఈ ఘటన గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లా ధృంగధర తాలూకాలో దుధ్ పూర్ లో జరిగింది. ఏడాదిన్నర బాలుడు శివమ్ 300 అడుగుల లోతు ఉన్న ఓ బోరు బావిలో పడిపోయాడు. వెంటనే పోలీసులుకు ఫోన్ చేశారు స్థానిక ప్రజానీకం. అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోలీస్, ధ్రంగ్ ధర మిలిటరీ స్టేషన్ కు ఫోన్ చేసి బోరుబావిలో పడిన చిన్నారిని రెస్క్యూ చేయాలని కోరారు.
Also Read
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
- Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
సంఘటన స్థలానికి చేరుకున్న ఆర్మీ క్విక్ రియాక్షన్ టీమ్ 300 అడుగులు ఉన్న బోరుబావిలో బాలుడు శివమ్ 25 అడుగుల లోతులో చిక్కుకుపోయినట్లు గుర్తించారు. చిన్నారి ముక్కు వరకు నీరు చేరిందని.. అతడు ఊపిరి పీల్చుకుంటుండటంతో పాటు అరుపులు వినిపించాయి. దీంతో వెంటనే రెస్య్కూ ప్రారంభించింది ఆర్మీ. కెప్టెన్ సౌరవ్ ఆధ్వర్యంలోని ఆర్మీ మెటాలిక్ హుక్ ను తగిలించిన ఓ తాడును బోరు బావిలోకి విడిచారు. నిమిషం వ్యవధిలోనే మెటాలిక్ హుక్ బాబు టీషర్ట్ కు తగిలింది. వెంటనే బోరు బావి నుంచి బాలుడిని పైకి లాగారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నవారు ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే బాలుడిని వైద్య పరీక్షల కోసం సురేంద్రనగర్‌లోని సియు షా ఆసుపత్రికి తరలించారు, బాలుడు శివమ్ పరిస్థితి నిలకడగా ఉంది.
రెస్క్యూ వీడియోను పీఆర్వో డిఫెన్స్ గుజరాత్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేసింది. కొద్ది సమయంలోనే ఈ వీడియో వైరల్ గా మారింది. రెస్క్యూ చేసిన ఆర్మీని నెటిజెన్లు అంతా ప్రశంసిస్తున్నారు.
#RESCUE#ARMY team was requisitioned by ASP Dharangadhara to rescue 18-month old #shivam fm 300 ft deep borewell at late night
GOLDEN KATAR GUNNERS under #Captain Saurav rushed to spot, modified metallic hook, rescued & took child to #hospital & declared out of danger@adgpi pic.twitter.com/TRdnwnliek
— PRO Defence Gujarat (@DefencePRO_Guj) June 8, 2022
తాజావార్తలు
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..