బెంగళూరులోని నందిహిల్స్ ప్రాంతం గురించి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. నంది హీల్స్ ట్రెక్కింగ్ చేసేందుకు అనువుగా ఉంటుంది. నంది హిల్స్ ప్రాంతంలో నిత్యం వందలాది మంది ట్రెక్కింగ్ చేస్తుంటారు. దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో ట్రెక్కింగ్ కోసం వస్తుంటారు. ఇదేవిధంగా ఢిల్లీకి చెందిన 19 ఏళ్ల నిశాంక్ శర్మ అనే యువకుడు నంది హిల్స్‌కు ట్రెక్కంగ్ కోసం వచ్చాడు. అయితే, అనుకోని విధంగా కొండపైనుంచి దొర్లి 300 అడుగుల కిందకు పడిపోయాడు. భూమిపై ఇంకా నూకలు ఉన్నాయి కాబట్టి నిశాంక్ శర్మ రెండు కొండల మధ్య ఇరుక్కుపోయాడు. కాసేపటికి తేరుకొని రక్షించేవారి కోసం పెద్దగా కేకలు వేశాడు.
Read: Revanth Reddy: జగ్గారెడ్డి మా నాయకుడు.. మేమంతా అండగా ఉంటాం..
అక్కడ ఎవరూ లేకపోవడంతో నిశాంక్‌కు ఏం చేయాలో అర్థం కాలేదు. తన జేబులో స్మార్ట్ ఫోన్ ఉందని గుర్తించి తన తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. తల్లిదండ్రులు ధైర్యం చెప్పడంతో, ఆ తరువాత చిక్‌మంగుళూరులోని పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. నిశాంక్ శర్మ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు అక్కడి చేరుకున్నారు. అయితే, కొండనుంచి 300 అడుగుల దిగువున రెండు కొండల మధ్య చిక్కుకోవడంతో ఇండియన్ ఆర్మీని రప్పించి నిశాంక్ శర్మను సురక్షితంగా బయటకు వచ్చేలా చేశారు. గాయపడిన నిశాంక్ శర్మను బెంగళూరులోని ఆర్మీ ఆసుపత్రిలో వైద్యం అందించారు. దీనికి సంబంధించిన న్యూస్ వైరల్ అవుతున్నది.