Reunited after 21 YEARS, Gujarat school student meets PM Modi: సరిగ్గా 21 ఏళ్ల తర్వాత ఆ ఇద్దరు మళ్లీ ముఖాముఖిగా కలుసుకున్నారు. ఇంతకీ ఎవరనుకుంటున్నారా..? 21 ఏళ్ల క్రితం విద్యార్థిగా ఉన్నప్పుడు మోదీ నుంచి పతకాన్ని అందుకున్న విద్యార్థి, ఆర్మీ మేజర్ గా మళ్లీ ప్రధానిని కలిశారు. దీపావళి వేళ ఈ అద్భుత జ్ఞాపకాన్ని గుర్తుచేసుకున్నారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ కార్గిల్ లో భారత జవాన్లతో కలిసి దీపావళి వేడుకలు చేసుకున్నారు.…
Indian Army sings MoU with 11 banks for Agniveer salary package: భారత సైన్యం కొత్తగా తీసుకువచ్చిన ఆర్మీ రిక్రూట్మెంట్ స్కీమ్ ‘ అగ్నివీర్’. ఈ పథకం కోసం ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే వీరికి సంబంధించిన సాలరీ ప్యాకేజీ కోసం 11 బ్యాంకులతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ఇండియన్ ఆర్మీ. అగ్నివీరులకు బ్యాంకింగ్ సౌకర్యాన్ని కల్పించడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్,
Army assault dog Zoom passed away: ఆర్మీ డాగ్ ‘జూమ్’ కన్నుమూసింది. రెండు రోజులుగా మృత్యువుతో పోరాడుతూ గురువారం చివరి శ్వాస విడిచింది. సోమవారం జమ్మూ కాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కీలక పాత్ర పోషించింది జూమ్. ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు ఎదురుకాల్పులు జరుగుతున్న క్రమంలో ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాడంలో కీలకంగా వ్యవహరించింది. ఈ ఆపరేషన్ సమయంలో జూమ్ కు రెండు బుల్లెట్ గాయాలు అయ్యాయి. ఓ వైపు బుల్లెట్ గాయాలు…
జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో భద్రతా బలగాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అనంత్‌నాగ్‌లోని తంగ్‌పావా ప్రాంతంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతమైనట్లు పోలీసులు తెలిపారు.
Lashkar Terrorist Killed In Encounter: జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. పుల్వామా, షోఫియాన్ జిల్లాల్లో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఆదివారం పుల్వామాలో సీఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులపైకి ఉగ్రవాదులు కాల్పలు జరిపారు. ఈ ఘటనలో విధి నిర్వహణలో ఉన్న ఒక పోలీస్ మరణించారు. సీఆర్పీఎఫ్ కు చెందిన సిబ్బంది గాయపడ్డారు. సంఘటన జరిగిన ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. పుల్వామాలోని పింగ్లాన వద్ద సీఆర్పీఎఫ్, కాశ్మీర్ పోలీసుల నాకా పార్టీపై ఉగ్రవాదులు దాడులు చేశారు.
Encounter Breaks Out In Jammu And Kashmir: జమ్మూకాశ్మీర్‌లో భద్రతబలగాలు, ఉగ్రవాదులకు మధ్య శుక్రవారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్ లో జైషే మహ్మద్(జేఎం) ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న ఇద్దరు టెర్రరిస్టులను భద్రతాబలగాలు హతమార్చాయి. బాముముల్లా జిల్లాలోొని మోడిపోరా, పట్టన్ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. దీనికి ముందు శుక్రవారం ఉదయం షోఫియాన్ జిల్లాలో కూడా ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమచారంతో గాలింపులు…
Hybrid Terrorists Arrested In Jammu Kashmir: జమ్మూకాశ్మీర్ లో ఇద్దరు హైబ్రిడ్ టెర్రిస్టులను అరెస్ట్ చేశారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ అన్సర్ గజ్వత్ ఉల్ హింద్ టెర్రర్ గ్రూపుకు చెందిన ఇద్దరు ఉగ్రవాదుల్ని ఆర్మీ, పోలీసులు కలిసి అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి మందుగుండు సామాగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. తీవ్రవాదుల కదలికలు ఉన్నాయనే పక్కా సమాచారంతో అనంత్ నాగ్ జిల్లా వాఘామా-ఓప్జాన్ రోడ్‌లో ఆర్మీ, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టింది. ఈ సమయంలోనే…
ఉగ్రవాద సంస్థ అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్ (AGuH)కి అనుబంధంగా ఉండి, వలసదారులను హతమార్చడంలో పాల్గొన్న ఇద్దరు ఉగ్రవాదులు జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో బుధవారం అర్ధరాత్రి పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు.
ఇండియన్ ఆర్మీ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) దివంగత జనరల్ బిపిన్ రావత్ గౌరవార్థం అరుణాచల్‌లోని కిబితు మిలిటరీ గార్రిసన్కు ఆయన పేరు పెట్టారు. కిబితులోని సైనిక స్టేషన్‌తో పాటు రహదారికి ఆయన పేరును పెట్టారు.