Agniveer recruitment: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆర్మీలో ‘అగ్నివీర్’ పథకాన్ని తీసుకువచ్చింది. దీనిపై పలు పార్టీల నుంచి వ్యతిరేకత వచ్చినా.. హింసాత్మక చర్యలకు పాల్పడిని కేంద్ర వెనక్కి తీసుకోలేదు. అయితే అగ్నివీర్ పథకానికి యువత నుంచి అనూహ్యమైన స్పందన వస్తోంది. పెద్ద ఎత్తున యువకులు అగ్నివీరులుగా మారడానికి అప్లై చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం అగ్నివీర్ రిక్రూట్మెంట్ పథకంలో మార్పులు చేయబోతోంది సైన్యం.
Air Force's Massive Exercise Near LAC In Northeast: ఇండియా-చైనా సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ యుద్ధానికి సిద్ధంగా ఉండాలంటూ నిన్న చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) సైనికులతో మాట్లాడారు. లడఖ్ వద్ద వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వద్ద సైనికులతో యుద్ధ సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. దీంతో చైనా మరేదైనా కుట్ర చేస్తుందా అనే అనుమానాలు వస్తున్నాయి.
పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో ఓ ఆర్మీ అధికారి తన భార్యను హత్య చేసి ఆదివారం రాత్రి తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనకు ముందు కల్నల్ ఓ సూసైడ్ నోట్ కూడా రాశారు.
Terrorist firing in Jammu and Kashmir: జమ్మూ కాశ్మీర్ లో రాజౌరీ ఉగ్రవాద ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హిందువులే టార్గెట్ గా ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు మొత్తం నలుగురు వ్యక్తులు మరణించారు. మరోవైపు ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు భద్రతాబలగాలు భారీగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఆదివారం సాయంత్రం 7 గంటలకు రాజౌరీలోని హిందువుల ఇళ్లకు చొరబడి కాల్పులు ప్రారంభించారు ముష్కరులు. ముందుగా వారి ఐడెంటిటీని గుర్తించేందుకు వారి ఆధార్…
Biggest Arms Recovery, Forces Stop Major Pak Attempt In Kashmir: దాయాది దేశం పాకిస్తాన్ ప్రశాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ లో అలజడులు రేపేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత నుంచి భారత భద్రతా బలగాలు ఉగ్రవాదులను వెంటాడి వేటాడి మట్టుబెడుతున్నాయి. దీంతో కొత్తగా హైబ్రీడ్ టెర్రిరిజాన్ని కూడా ప్రారంభించాయి ఉగ్రవాద సంస్థలు. అమాయకులైన పౌరులను కాల్చి చంపేస్తున్నాయి. అయితే ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారిని కూడా భద్రతా బలగాలు చంపేస్తున్నాయి.…
Sania Mirza going to be India's first Muslim fighter pilot: ఉత్తర ప్రదేశ్ కు చెందిన యువతి సానియా మీర్జా భారతదేశపు తొలి ముస్లిం ఫైటర్ పైలట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే దేశంలో తొలి ముస్లిం మహిళా ఫైటర్ పైలట్ కానున్నారు. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన మామూలు టీవీ మెకానిక్ కుమార్తె అయిన సానియా మీర్జా ఎన్డీఏ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి వార్తల్లో నిలిచారు. సానియా ఎన్డీఏ(నేషనల్ డిఫెన్స్…
16 Indian Army jawans killed in road accident in Sikkim: ఈశాన్య రాష్ట్రం సిక్కింలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్మీ జవాన్లతో ప్రయాణిస్తున్న టక్కు లోయలో పడింది. ఉత్తర సిక్కిం సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఏటవాలుగా ఉన్న రోడ్డు నుంచి ట్రక్కు జారిపోయి లోయలో పడింది