జమ్మూలో పాకిస్థాన్ దాడులకు భారత్ ప్రతిస్పందించడం ప్రారంభించింది. పాకిస్థాన్‌లో భారతదేశం క్షిపణి, డ్రోన్ దాడులు చేస్తోంది. భారతదేశం డ్రోన్లతో లాహోర్ పై పెద్ద దాడి చేసింది. పెషావర్, సియాల్కోట్, ఇస్లామాబాద్ వంటి నగరాలు కూడా క్షిపణి, డ్రోన్ దాడులకు గురయ్యాయి. దీనికి ముందే.. భారత్ లాహోర్‌లో పాకిస్థాన్ వైమానిక రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసింది. ఇది పొరుగు దేశానికి పెద్ద దెబ్బ. భారతదేశం యొక్క ప్రతీకార చర్యతో ఉలిక్కిపడిన పాకిస్తాన్.. గురువారం రాత్రి జమ్మూ, రాజస్థాన్, పంజాబ్,…
Big Breaking : భారత వైమానిక దళం మరోసారి పాకిస్తాన్‌కు గట్టి షాక్ ఇచ్చింది. సరిహద్దులు దాటి భారత గగనతలంలోకి చొచ్చుకురావడానికి ప్రయత్నించిన పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ చెందిన F-16 యుద్ధ విమానాన్ని భారత సైన్యం సమర్థవంతంగా కూల్చివేసింది. ఈ ఘటనలో F-17S జెట్‌ను కూడా కూల్చివేసినట్లు సమాచారం అందుతోంది. వివరాల ప్రకారం, పఠాన్‌కోట్ ఎయిర్ బేస్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించిన ఒక F-16ను భారత బలగాలు మధ్యలోనే గుర్తించి అడ్డుకున్నాయి. క్షణాల్లో స్పందించిన భారత సైనికులు…
'ఆపరేషన్ సిందూర్'తో నిరాశ చెందిన పాకిస్థాన్.. భారతదేశంలోని సైనిక స్థావరాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. కానీ భారత సైన్యం ఈ దాడిని తిప్పికొట్టింది. ఈ అంశంపై వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషి సమాచారం ఇచ్చారు. గత 24 గంటల్లో పాకిస్థాన్ సైన్యం భారతదేశాన్ని ఎలా లక్ష్యంగా చేసుకుందో వివరించారు. వారి ఎత్తుగడలు ఏవీ విజయవంతం కాలేదని స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ లక్ష్యం ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడం..
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రవాద దాడితో భారత్ రగిలిపోయింది. దీని ప్రతీకార చర్యను పాకిస్థాన్ గుర్తించలేక పోయింది. కేవలం ఇరవై ఐదు నిమిషాల్లో ఉగ్రవాదులను అంతం చేయడంలో భారత్ సఫలమైంది. భారత సైన్యం దూకుడు విధానాన్ని పాకిస్థాన్ ఎప్పటికీ మర్చిపోదు. ఈ వైమానిక దాడి సంవత్సరాల తరబడి పాకిస్థాన్‌లో ప్రతిధ్వనిస్తుంది. ఈ దాడిలో అత్యంత భయంకరమైన ఉగ్రవాది మౌలానా మసూద్ అజార్ కుటుంబీకుల రక్తం చిందింది. వందలాది మందిని పొట్టన బెట్టుకున్న ఈ మూర్ఖుడు తన కుటుంబీకుల్లో…
Indian Air Force: భారతదేశంలో మరో రోడ్ ‘రన్ వే’ని ఈ రోజు ప్రారంభించనున్నారు. భారత వైమానిక దళం ఉత్తర్ ప్రదేశ్ షాజహాన్‌పూర్ జిల్లాలోని గంగా ఎక్స్‌ప్రెస్‌వే పై నిర్మించిన 3.5 కి.మీ పొడవైన ఎయిర్ స్ట్రిప్‌ని శుక్రవారం ప్రారంభించనుంది. ఇది దేశ రక్షణను మరింత పెంచుతుంది. అధునాతన లైటింగ్, నావిగేషన్ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. ఈ ఎయిర్ స్ట్రిప్‌పై యుద్ధ విమానాలు పగలు, రాత్రి ల్యాండింగ్ చేయవచ్చు. భారత్‌లో ఇలాంటి సదుపాయం ఉన్న ఎయిర్‌స్ట్రిప్‌లో ఇదే…
దక్షిణ కశ్మీర్‌లోని పహల్గామ్లోని బైసారన్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించారు. ఈ ఉగ్రవాద దాడి తర్వాత, భారతదేశం, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. దాడి తర్వాత భారతదేశం కఠిన చర్యలు తీసుకుంది. సింధు జల ఒప్పందాన్ని రద్దు చేయడంతో సహా అనేక ఆంక్షలు విధించింది. భారతదేశం తీసుకున్న పెద్ద నిర్ణయాల తర్వాత.. పాకిస్థాన్ కూడా నిరంతరం బెదిరింపులు జారీ చేస్తోంది. బయటకు హెచ్చరికలు చేసినా.. నిజానికి పాకిస్థాన్ లోలోపల వణుకుతోంది.…
Indian Air Force: భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు అలుముకుంటున్నాయి. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిలో పాకిస్తాన్ పాత్ర స్పష్టంగా కనిపిస్తోంది. లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రసంస్థ ‘‘టీఆర్ఎఫ్’’ ఉగ్రవాదుల కాల్పుల్లో 26 మంది టూరిస్టుల మరణించారు. దీంతో ప్రజలు పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Cyber attack: మయన్మార్ భూకంప రెస్క్యూలో పాల్గొన్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్(IAF) విమానాలపై సైబర్ దాడి జరిగింది. ఐఏఎఫ్‌కి చెందిన C-130J విమానం మయన్మార్‌లో ప్రయాణిస్తున్నప్పుడు GPS-స్పూఫింగ్ దాడిని ఎదుర్కొన్నట్లు రక్షణ వర్గాలు వెల్లడించాయి.
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆదిలాబాద్ లో ఏర్పాటు చేసేందుకు తలపెట్టిన ఎయిర్‌పోర్టు నిర్మాణానికి పౌరవిమానాశ్రయానికి భారత వాయుసేన (IAF) అంగీకరించింది. భారత ఎయిర్ ఫోర్స్ నుంచి అనుమతులు రావడంపై జిల్లా వాసుల్లో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసి, పౌరవిమాన సేవలను అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పరిగణలోకి తీసుకుంది.
IAF Air Show : కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ ఆకాశంలో వైమానిక ప్రదర్శన కనువిందు చేసింది. ఆదివారం నాడు ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన ఈ ఉత్కంఠభరితమైన విన్యాసాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున జనాలు తరలివచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దేవాదాయ శాఖ…