Terrorists Attack: జమ్మూ కాశ్మీర్లో మరోసారి ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. పూంచ్ జిల్లాలోని సూరన్‌కోట్ ప్రాంతంలో సైనిక సిబ్బంది ప్రయాణిస్తున్న రెండు వాహనాలపై కాల్పులు జరిపారు.
Indian Air Force : భారత్ తన క్షిపణి శక్తిని నిరంతరం పెంచుకుంటోంది. దేశం తన సైనిక సామర్థ్యాలను పటిష్టం చేసుకుంటోంది. కొత్త క్షిపణులను పరీక్షిస్తోంది. కాగా, ఆ దేశం మరో కొత్త బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది.
Indian Air Force: యువతికి అన్నయ్య లేని లోటును తీర్చారు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కమాండోలు. దగ్గరుండీ యువతి పెళ్లిని ఘనంగా నిర్వహించారు. అన్నీ తామై ఎలాంటి లోటు రాకుండా పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. తన అన్నయ్య విధి నిర్వహణలో వీరమరణం పొందినప్పటికీ, ఆయన లేని లోటు గుర్తుకు రాకుండా వ్యవహరించి శభాష్ అనిపించుకున్నారు. 2017లో బీహార్‌లో మరణించిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ దళ కమాండో సోదరి వివాహానికి గరుడ యూనిట్‌కి చెందిన కమాండోలు హాజరై పెళ్లి తంతును నిర్వహించారు.
Indian Air Force : భారత వైమానిక దళం మరోసారి తన సన్నద్ధతను, సత్తాను చాటింది. వైమానిక దళం తన డోర్నియర్ విమానాన్ని సమాచారం అందగానే పంపింది. ఈ విమానం న్యూ ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్ నుండి వైద్యుల బృందాన్ని హెర్లిప్ట్ చేసింది.
Kargil Night Landing: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కార్గిల్ ప్రాంతంలోని ఎయిర్ స్ట్రిప్‌పై భారీ రవాణా విమానం C130-Jని రాత్రి సమయంలో విజయవంతంగా ల్యాండింగ్ చేసింది. లడఖ్ ప్రాంతంలోని నియంత్రణ రేఖ (ఎల్ఓసి) సమీపంలో ఉన్న ఎయిర్‌స్ట్రిప్‌లో నైట్ ల్యాండింగ్ చేయడం ఇదే మొదటిసారి. యూఎస్ లాక్డీడ్ మార్టిన్ తయారు చేసిన C-130J సూపర్ హెర్క్యూలస్ విమానాన్ని సరుకులు, సైనికులు రవాణాతో పాటు కొన్ని ప్రత్యేక అవసరాల కోసం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వాడుతోంది.
Indian Air Force : భారత వైమానిక దళం సరికొత్త, చాలా సవాలుతో కూడిన ఫీట్‌ని సాధించింది. మొదటిసారిగా ఎయిర్ ఫోర్స్ (IAF) చీకటిలో కార్గిల్ ఎయిర్‌స్ట్రిప్‌లో C-130J హెర్క్యులస్ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసింది.
Mission to Space Station: భారత్ మరో అంతరిక్ష కార్యక్రమానికి సిద్ధమవుతోంది. భారత వ్యోమగామిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(ఐఎస్ఎస్)కి పంపాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా భారత్ వైమానిక దళానికి చెందిన పైలెట్లకు శిక్షణ ఇస్తోంది. నాసా-ఇస్రో మధ్య సహకారంలో భాగంగా పైలట్లకు శిక్షణా కార్యక్రమం జరుగుతోంది. 2024 నాటికి భారత వ్యోమగామిని స్పేస్ స్టేషన్‌కి పంపించాలనే మనదేశం భావిస్తోంది.
Rajnath Singh: టెక్నాలజీకి అనుగుణంగా అప్డేట్ అవ్వాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. ఇవాళ ఉదయం దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ జరిగింది.
Bhubaneswar : భారత వైమానిక దళంలో మహిళలకు ఛాన్స్ ఉండేది కాదు. కానీ లింగ పరిమితిని ఉల్లంఘించి ఓ మహిళ చరిత్ర సృష్టించింది. ఆమె పేరు మనీషా పాధి. ఇటీవలే మహిళా అసిస్టెంట్-డి-క్యాంప్ అంటే ADCగా నియమితులయ్యారు.
ఇంఫాల్ విమానాశ్రయం సమీపంలో గుర్తుతెలియని ఎగిరే వస్తువు కలకలం సృష్టించింది. ఆదివారం మణిపూర్‌లోని ఇంఫాల్ విమానాశ్రయానికి సమీపంలో 'అజ్ఞాత ఎగిరే వస్తువు' (UFO) కనిపించిందని సమాచారం అందుకున్న భారత వైమానిక దళం రెండు రాఫెల్ ఫైటర్ జెట్లను రంగంలోకి దించింది.