Viral Video: పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్‌ని చావు దెబ్బ తీసింది. ఉగ్రవాదుల శిబిరాలపై భారత్ దాడి చేసిన తర్వాత, మన దేశ భూభాగాల్లోని పౌరులు, మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు, విమానాలు, మిస్సైళ్లతో దాడులకు పాల్పడింది. అయితే, భారత గగనతల రక్షణ వ్యవస్థలు సమర్థంగా వీటిని అడ్డుకున్నాయి. ఈ దాడులకు ప్రతీకారంగా, భారత్ పాకిస్తాన్‌లోని కీలక వైమానిక స్థావరాలపై దాడులు చేసింది. లాహోర్, రావల్పిండి, ఇస్లామాబాద్, కరాచీ, సియాల్‌కోట్ ఇలా ఏ ప్రాంతాన్ని కూడా వదలిపెట్టకుండా భారత్ విధ్వంసం సృష్టించింది.
Read Also: Jagga Reddy: అమెరికా చెబితే మోడీ పాక్తో యుద్ధాన్ని ఆపేశాడు.. ఇందిరా గాంధీ అలా చేయలేదు..
ఇదిలా ఉంటే, భారత్ ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్ మిరాజ్ ఫైటర్ జెట్‌ని కూల్చేసినట్లు ఈ రోజు ధ్రువీకరించింది. భారత సైన్యం షేర్ చేసిన వీడియోలో మిరాజ్ శిథిలాలను చూడొచ్చు. ఆపరేషన్ సింధూర్ గురించి నిర్వహించిన మీడియా సమావేశంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, డైరెక్టర్ జనరల్ ఎయిర్ ఆపరేషన్స్ ఎయిర్ వైస్ మార్షల్ AK భారతి మరియు డైరెక్టర్ జనరల్ ఆఫ్ నావల్ ఆపరేషన్స్ వైస్ అడ్మిరల్ AN ప్రమోద్ పాల్గొన్నారు. స్వదేశీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ‘‘ఆకాశ్’’ అద్భుతంగా పనిచేసిందని ఎయిర్ మార్షల్ చెప్పారు. 100 మందికి పైగా జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాదుల్ని హతమార్చినట్లు భారత సైన్యం తెలిపింది.
आकाशे शत्रुन् जहि I
Destroy the Enemy in the Sky.#PahalgamTerrorAttack #OperationSindoor#JusticeServed #IndianArmy@IAF_MCC @indiannavy pic.twitter.com/vO28RS0IdE
— ADG PI – INDIAN ARMY (@adgpi) May 12, 2025