Amit Shah: “మేము అణ్వాయుధ బెదిరింపులకు భయపడము”.. పాక్‌కు అమిత్ షా వార్నింగ్..
- ప్రధాని మోడీ ఏ అవకాశాన్ని వదిలిపెట్టలేదు
- దేశాన్ని సురక్షితంగా ఉంచే పని ప్రధాని చేశారు
- 2014 కి ముందు, రోజూ ఉగ్రదాడులు జరిగేవి
- అప్పటి ప్రభుత్వంలో ఎవ్వరూ స్పందించేవారు కాదు
- ప్రస్తుతం మోడీ ప్రతీ అంశంపై స్పందిస్తున్నారు
- కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశాన్ని అభివృద్ధి చేయడంలో ప్రధాని మోడీ ఏ అవకాశాన్ని వదిలిపెట్టలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశాన్ని సురక్షితంగా ఉంచే పని ప్రధాని మోడీ చేశారన్నారు. గాంధీనగర్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. 2014 కి ముందు, ప్రతిరోజూ ఉగ్రవాద దాడులు జరిగాయని.. కానీ అప్పటి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదని విమర్శించారు. కానీ ఇప్పుడు అలా కాదని శత్రు దేశానికి తగిన సమాధానం చెబుతామన్నారు. సైన్యం ఇటుకలకు రాళ్లతో ప్రతిస్పందించిందని అన్నారు. సైన్యం కారణంగా తాము గర్వంగా తలలు పైకెత్తామన్నారు. అణు ముప్పుకు తాము భయపడటం లేదని మరోసారి వ్యాఖ్యానించారు.
READ MORE: Eatala Rajendar: ఉగ్ర కుట్రలకు ప్రతిఫలం ఏంటో పాకిస్తాన్ చూసింది..
Also Read
- Kalki Bhagwan: ఆధ్యాత్మిక గురువు విజయ్ కూమార్ అలియాస్ కల్కి భగవాన్‌కు అస్వస్థత..!
- మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
- TRAI New Recharge Rules: TRAI కొత్త నిబంధనలు.. Jio, Airtel, Vi రీఛార్జ్ ప్లాన్లలో కీలక మార్పులు..
- Telangana High Court: "ఆ పోలీసులను గుర్తించండి".. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
ఆపరేషన్ సిందూర్ గురించి అమిత్ షా మరోసారి మాట్లాడారు. భారత వైమానికి దళం పాకిస్థాన్ లోకి 100 కిలోమీటర్లు ప్రవేశించి దాడులు చేసిన విధానాన్ని గుర్తు చేశారు. ” మేము అణ్వాయుధ బెదిరింపులకు భయపడము. బార్డర్ నుంచి100 కిలోమీటర్ల లోపల దాడులు చేశాం. పాకిస్థాన్ వైమానిక స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. మన వాయు రక్షణ వ్యవస్థ చాలా బలంగా ఉంది. దీన్ని చూసి ప్రస్తుతం పాకిస్థాన్ భయపడుతోంది. 2014 కి ముందు ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచి వచ్చేవారు. వాళ్ళు మన వాళ్ళని చంపి వెళ్ళిపోయేవారు. కానీ గత ప్రభుత్వం ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఉగ్రవాదులు మూడు పెద్ద దాడులకు పాల్పడ్డారు. ఇటీవల పాకిస్థాన్ స్పాన్సర్ చేసిన ఉగ్రవాదులు పహల్గామ్‌పై దాడి చేశారు. కానీ ప్రతి దాడిపై ప్రధాని మోడీ స్పందించారు. ఈ రోజు ప్రపంచం మొత్తం ఆశ్చర్యంగా చూస్తుంది. పాకిస్థాన్ మాత్రం భయంతో వణుకుతోంది.” అని అమిత్ షా వ్యాఖ్యానించారు.
READ MORE: Bhairavam: వారికి గ్యాప్ వచ్చింది.. ముగ్గురు హీరోలను హ్యాండిల్ చేయడం కష్టమని అనుకున్నా!
తాజావార్తలు
-
Kalki Bhagwan: ఆధ్యాత్మిక గురువు విజయ్ కూమార్ అలియాస్ కల్కి భగవాన్‌కు అస్వస్థత..!
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
TRAI New Recharge Rules: TRAI కొత్త నిబంధనలు.. Jio, Airtel, Vi రీఛార్జ్ ప్లాన్లలో కీలక మార్పులు..
-
Telangana High Court: “ఆ పోలీసులను గుర్తించండి”.. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
ట్రెండింగ్
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!