India Pakistan War: పహల్గామ్ ఉగ్రదాడి చేసి ఏం అవుతుందిలే, భారత్ ఏం చేస్తుందిలే అనుకున్న పాకిస్తాన్ ఇప్పుడు, దాడి ఎందుకు చేశామా..? అని బాధపడటం తథ్యం. ఎందుకంటే, భారత్ వైమానిక దాడుల్లో భారీ ఎత్తున పాకిస్తాన్ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. భారత్ ఈ రేంజ్లో అటాక్ చేస్తుందని దాయాది ఊహించలేదు. ఉరి, పుల్వామా ఉగ్రదాడులు జరిగిన తర్వాత, భారత్ చేసినట్లు ఏదైనా చిన్న సర్జికల్ స్ట్రైక్స్ మాత్రమే చేస్తుందని అనుకుంది.
Operation Sindoor: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ ప్రారంభించింది. ఈ ఆపరేషన్ గురించి త్రివిధ దళాల సైనికాధికారులు మాట్లాడారు. భారత సైన్యం మే 7-10 మధ్య జరిపిన ప్రతీకార దాడుల్లో పాకిస్తాన్ సైన్యానికి చెందిన 35-40 మంది చనిపోయినట్లు మిలిటరీ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్ డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ శనివారం చెప్పారు.
Operation Sindoor: ‘‘ఆపరేషన్ సిందూర్’’ తర్వాత తొలిసారిగా భారత త్రివిధ దళాలు మీడియా సమావేశం నిర్వహించాయి. ఈ సమావేశంలో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ డీజీఎంఓ పాల్గొన్నారు. ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాదులు, వారి మద్దతుదారుల్ని టార్గెట్ చేస్తూ చేసినట్లు సైనికాధికారులు చెప్పారు.
Indian Air Force: ఆపరేషన్ సింధూర్పై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంచలన ప్రకటన విడుదల చేసింది. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని తేల్చి చెప్పింది. ఆపరేషన్ ఇంకా ముగియలేదని తెలిపింది.
శనివారం ఉదయం భారత్లోని అనేక ప్రాంతాలలో పాకిస్థాన్ డ్రోన్ దాడులను నిర్వహించింది. జమ్మూ కశ్మీర్లోని ఉధంపూర్ జిల్లాలో ఉన్న వైమానిక దళ స్టేషన్ను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నం చేసింది. అయితే.. భారత సైన్యం, రక్షణ వ్యవస్థ శత్రు డ్రోన్ను గాల్లోనే కూల్చివేశాయి. ఈ సమయంలో వైమానిక దళ స్టేషన్లో విధుల్లో ఉన్న ఒక సైనికుడు వీరమరణం పొందాడు. పాకిస్థాన్ డ్రోన్ ముక్కను ఢీకొట్టడంతో అమరుడయ్యారు.
రాజౌరి పట్టణాన్ని లక్ష్యంగా చేసుకుని పాక్ కాల్పులు జరపడంతో.. రాజౌరి అడిషనల్ డిప్యూటీ కమిషనర్ రాజ్ కుమార్ అధికారి నివాసం పూర్తిగా ధ్వంసమైంది. ఈ దాడుల్లో ఆయన మరణించారు.
Pakistani Drone Strike: పాకిస్తాన్ శుక్రవారం నాడు చీకటి పడగానే. భారత్ పై డ్రోన్లతో దాడికి దిగింది. ఇండియాలోని 26 ప్రదేశాలను టార్గెట్ గా చేసుకుని డ్రోన్లు ప్రయోగించింది.
Operation Sindoor : పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ vs పాక్ ఉద్రిక్తతలు పెరిగిన వేళ, ఆకాశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పాకిస్తాన్కు చెందిన అత్యంత కీలక ఎయిర్ వార్నింగ్ వ్యవస్థ అయిన AWACS విమానం భారత వైమానిక దళం చర్యతో కూలిపోయింది. ఇది కేవలం ఓ విమానం నష్టం కాదు, దాయాది దేశానికి వ్యూహాత్మకంగా చెమటలు పట్టించే పరిణామం. భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై…
Rohit Sharma: భారత్–పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఇరు దేశాలలో ప్రజలు భయబ్రాంతులకు లోనవుతున్నారు. ఇటీవల జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా, భారత్ “ఆపరేషన్ సిందూర్” పేరిట పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిగా పాకిస్థాన్ కూడా జమ్మూ కశ్మీర్ తో పాటు ఇతర ప్రాంతాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. Also Read: Pakistan: కొత్త బిచ్చగాడు పొద్దెరగడు.. పైసల…
ఆపరేషన్ సిందూర్ తర్వాత.. పాకిస్థాన్ గురువారం రాత్రి భారత్లోని అనేక ప్రాంతాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. భారత సైన్యం, నావికాదళం, వైమానిక దళం పాకిస్థాన్లోని వివిధ ప్రధాన నగరాలపై సంయుక్త దాడులు ప్రారంభించాయి. ఈ దాడి కాస్త క్రమ క్రమంగా పెరుగుతూ వచ్చింది. దీంతో పాకిస్థాన్ లోని సాధారణ ప్రజలు, అధికారులు భయపడుతున్నారు. చాలా మంది పాక్ అధికారులు విదేశాలకు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఉన్నత స్థాయి అధికారులు విమానం ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపించిందని పలు మీడియా…