బాలీవుడ్ నటి జూహీ చావ్లాకు గట్టి షాక్ తగిలింది.. 5జీ వైర్లెస్ నెట్‌వర్క్‌కు సంబంధించి ఇండియాలో ట్రయల్స్‌ను వ్యతిరేకిస్తూ ఆమె ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఇవాళ ఆ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు.. ఆమెకు భారీగా జరిమానా విధించింది… జూహీ చావ్లా.. న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేసిందని ఆ సందర్భంగా వ్యాఖ్యానించిన హైకోర్టు.. కేవలం పబ్లిసిటీ కోసం ఈ పిటిషన్ వేసినట్టుగా ఉందని పేర్కొంది.. చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేసినందుకు గాను జూహీ చావ్లా సహా…
కరోనా వైరస్ ఇండియాలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. దేశంలో కొత్తగా 1,32,364 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటివరకు ఇండియాలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,85,74,350 కి చేరింది. ఇందులో 2,65,97,655 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 16,35,993 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 2713 మంది మృతిచెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,40,702 కి చేరింది. ఇక ఇదిలా…
స్థిర ఆర్థికాభివృద్ధిలో 2020–21కు సంబంధించి రాష్ట్రాల వారీగా నీతి ఆయోగ్ ర్యాంకులు విడుదల చేసింది. పలు అంశాల్లో మంచి పనితీరు కనపరిచినందుకు ఏపీకి ర్యాంకులు ప్రకటించింది నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ తాజా ర్యాకింగ్స్ లో టాప్ ఐదు రాష్ట్రాల్లో ఏపీకి చోటు దక్కింది. 2020-21 సంవత్సరానికి ఎస్డీజీ ఇండియా ఇండెక్స్ లో 72 స్కోర్ తో మూడో స్థానంలో ఏపీ నిలిచింది. గతేడాదితో పోలిస్తే 5 పాయింట్లు అధికంగా సాధించింది ఏపీ. 75 స్కోర్ తో…
ఇండియాలో కరోనా ఉదృతి కొనసాగుతోంది. కరోనా కేసులు ప్రస్తుతం లక్షన్నరకు దిగువున నమోదవుతున్నాయి. అటు మరణాల సంఖ్యకూడా తగ్గుముఖం పడుతున్నది. కేంద్రం రిలీజ్ చేసిన కరోనా బులిటెన్ ప్రకారం దేశంలో కొత్తగా 1,34,154 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,84,41,986కి చేరింది. ఇందులో 2,63,90,584 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 17,13,413 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 2887 మంది మృతి చెందారు.…
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యక్సిన్ లు రెండు డోసులు వేయాలి. మొదటి వ్యాక్సిన్ తీసుకున్న 28 రోజులకు సెకండ్ డోస్ తీసుకోవాలి. రెండు డోసుల విధానం వలన వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆలస్యంగా సాగుతున్నది. దీంతో సింగిల్ డోస్ వ్యాక్సిన్ ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ప్రపంచంలో కరోనాకు తొలి వ్యాక్సిన్‌ను తయారు చేసిన స్పుత్నిక్ వి సింగిల్ డోస్ ను రెడీ చేసింది. ఇప్పటికే…
ఇండియాలో కరోనా కేసులు గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. అయితే తాజా కరోనా బులిటెన్ ప్రకారం దేశంలో కొత్తగా 1,32,788 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,83,07,832 కి చేరింది. ఇందులో 2,61,79,085 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 17,93,645 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 3,207 మంది మృతి చెందారు. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య…
ఓవైపు కరోనా సెకండ్ వేవ్ విజృంభణ ఇంకా కొనసాగుతూనే ఉన్న సమయంలో.. భారత్ నుంచి వచ్చే విమానాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది నెదర్లాండ్స్ ప్రభుత్వం.. భారత్‌తో పాటు.. దక్షిణ అమెరికా, మధ్య అమెరికా, దక్షిణాఫ్రికా విమానాలపై కూడా నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు.. ఈ రోజు నుంచి ఇది అమల్లోకి వచ్చింది.. నెదర్లాండ్స్ తీసుకున్న తాజా నిర్ణయంతో.. ఆయా దేశాల నుంచి ప్రయాణికులు నెదర్లాండ్స్ వెళ్లేందుకు మార్గం సుగమం అయ్యింది.. అయితే, కరోనా కేసులు ఇంకా నమోదు…
కరోనా ఫస్ట్ వేవ్ పెద్దలపై తీవ్రమైన ప్రభావం చూపింది.. సెకండ్ వేవ్ యూత్‌ను కూడా అతలాకుతలం చేసింది.. ఇప్పుడు థర్డ్ వేవ్ ముప్పు పొంచిఉండగా.. దాని ప్రభావం చిన్నారులపైనే ఎక్కువగా ఉంటుందని హెచ్చరికలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.. అయితే, దీనిపై స్పందించిన నీతిఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్.. కరోనా వైరస్ తన స్వభావాన్ని మార్చుకుంటే పిల్లలపై అధిక ప్రభావం చూపవచ్చు అన్నారు.. ఆ పరిస్థితి వస్తే.. రెండు నుంచి మూడు శాతం చిన్నారులు ఆస్పత్రుల్లో చికిత్స…
ఇప్పుడు రెండింటిపైనే ప్రధాన చర్చ.. ఒకటి ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ అయితే.. మరోటి.. దానికి చెక్ పెట్టే వ్యాక్సినేషన్… ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ల ప్రకారం.. నిర్ణీత కాల వ్యవధిలో ఒక్కొక్కరు రెండు డోసులు తీసుకోవాలి.. అయితే, ఇప్పుడు పరిస్థితి కొంత గందరగోళంగా తయారైంది.. ఫస్ట్ డోస్‌గా కొవాగ్జిన్ తీసుకున్న చోట.. ఇప్పుడు కొవిషీల్డ్ టీకా అందుబాటులో ఉంది.. దీంతో.. ఫస్ట్‌డోస్ అది వేసి.. సెకండ్ డోస్ ఇది వేస్తే ఎలా ఉంటుంది? అసలు…