నూతన ఐటీ నిబంధనల అమలుపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తుది వార్నింగ్ అనంతరం ట్విట్టర్ వెనక్కి తగ్గింది. మొదట ససేమిరా అన్న ట్విట్టర్.. తాజాగా ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త నిబంధనలను పాటించేందుకు సిద్ధమేనని తెలిపింది. అయితే, వాటి అమలుకు మరికొంత సమయం కావాలని కోరినట్లు సమాచారం. దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఐటీ చట్టాల అమలుకు కొంత సమయం కావాలని ట్విట్టర్ యాజమాన్యం కోరింది. కాగా చివరి అవకాశం ఇస్తూ కేంద్రం రాసిన ఘాటు లేఖకు…
రీల్ నటుడు సోనూసూద్ కరోనా మహమ్మారి దేశాన్ని వణికిస్తున్న సమయంలో పేదలకు ఎంతో సహాయం చేసి రియల్ హీరోగా నిలిచిన విషయం తెలిసిందే. ఆయన చేసిన సహాయక చర్యలపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురిసింది. అయితే తాజాగా సోనూసూద్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా దాదాపు 16-18 రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, నెల్లూరు, కర్నూలు జిల్లలో రెండు ప్రదేశాలు లాక్ చేయడంతో ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని,…
ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గతంలో నాలుగు లక్షలకు పైగా నమోదవ్వగా, ఇప్పుడు ఆ కేసుల సంఖ్య లక్షకు తగ్గిపోయింది. తాజాగా కేంద్రం కరోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ ప్రకారం దేశంలో కొత్తగా 92,596 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,90,89,069కి చేరింది. ఇందులో 2,75,04,126 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 12,31,415 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇకపోతే, గడిచిన 24 గంటల్లో ఇండియాలో…
గత ఏడాది కాలంగా తూర్పు లద్ధాఖ్ ప్రాంతంపై చైనా కన్నేసింది. చైనా బోర్డర్లో భారీగా సైనికులను మోహరిస్తూ రావడంతో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అదే సమయంలో ఇరు దేశాలకు చెందిన సైనికుల మద్య బాహాబాహీలు జరిగాయి. ఈ దాడుల్లో ఇరు దేశాలకు చెందిన సైనికులు మృతి చెందారు. తూర్పు లద్ధాఖ్ సరిహద్దుల నుంచి సైనికులను వెనక్కి తీసుకుంటూనే చైనా తన బోర్డర్‌ను ఆధునీకరిస్తు వచ్చింది. యుద్ధ విమానాలు, ఆయుధ సామాగ్రిని భద్రపరిచేందుకు కాంక్రట్ నిర్మాణాలను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా…
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో.. దేశంలో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను సడలించి.. నైట్ కర్ఫ్యూ విధిస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, మేఘాలయల్లో లాక్డౌన్ విధిస్తూనే…. భారీగా సడలింపులు ఇచ్చారు. తాజాగా బిహార్‌లో లాక్డౌన్ తొలిగించారు. అయితే అక్కడ రాత్రి 7 గంటల నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఉత్తరప్రదేశ్‌లో లాక్డౌన్ ఎత్తేసి.. పగటిపూట కర్ఫ్యూ కొనసాగించినప్పటికీ… తాజాగా ఆ కర్ఫ్యూను కూడా తొలిగించి నైట్ కర్ఫ్యూను…
కరోనా మహమ్మారిపై సెలవిచ్చారు నిత్యానంద స్వామి… భారత్‌తో పాటు అనేక దేశాలకు కునుకులేకుండా చేస్తున్న కోవిడ్ వైరస్‌పై ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. లైంగిక వేధింపుల కేసుల్లో చిక్కుకుని.. గుట్టుచప్పుడు కాకుండా భారత్‌ను విడిచి పారిపోయిన నిత్యానంద.. కొంత కాలం ఎక్కడున్నారు కూడా ఎవ్వరికీ తెలియదు.. ఆ తర్వాత ఈక్వెడార్ సమీపంలో ఓ దీవిని కొనేసి.. దానికి కైలాస దేశం అని పేరు కూడా పెట్టేశారాయన.. అయితే, నిత్యానంద అక్కడున్నా.. భారత్‌లో మాత్రం తరచూ వార్తల్లో నిలుస్తుంటారు..…
కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ఇప్పుడున్న ఏకైకమార్గం వ్యాక్సినేషన్ ఒకటే.. కానీ, వ్యాక్సినేషన్‌పై ఇప్పటికే ఎన్నో అనుమానాలున్నాయి.. పట్టణాలు, నగరాలు కూడా వీటికి మినహాయింపు కాదు.. ఇక, గ్రామీణ ప్రాంతాల్లో అయితే, వ్యాక్సిన్ అంటేనే నాకు వద్దు బాబోయ్ అనేవారు ఉన్నారు.. కానీ, ఓ మారుమూల గ్రామంలో.. వందకు వందశాతం మంది వ్యాక్సిన్ తీసుకుని రికార్డు కెక్కారు.. ఈ అరుదైన ఘనత సాధించింది జమ్మూ కశ్మీర్‌లోని బందిపోరా జిల్లా వేయాన్ గ్రామం.. అక్కడ 18 ఏళ్లు పైబడిన…
కరోనా వైరస్ ఇండియాలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. దేశంలో కొత్తగా 86,498 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటివరకు ఇండియాలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,89,96,473 కి చేరింది. ఇందులో 2,73,41,462 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 13,03,702 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 2123 మంది మృతిచెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,51,309 కి చేరింది. ఇక ఇదిలా…
ఇలాంటి మహా విపత్తు ఎప్పుడూరాలేదు అన్నారు భారత ప్రధాని నరేంద్ర మోడీ.. ఇవాళ జాతినుద్దేశించి ప్రసంగించిన ఆయన.. ఆధునిక కాలంలో ఇలాంటి మహా విపత్తు ఎప్పుడూరాలేదు.. గత వందేళ్లలో ఇదే అతిపెద్ద మహమ్మారి అన్నారు. కరోనాతో దేశప్రజలు ఎంతో బాధ అనుభవించారన్న ఆయన.. దేశ చరిత్రలో ఇంత మెడికల్ ఆక్సిజన్ ఎప్పుడూ అవసరం పడలేదన్నారు.. ఈ సమయంలో దేశంలో మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిని 10 రెట్లు పెంచామని వెల్లడించారు.. ఆర్మీ, నెవీ, ఎయిర్‌పోర్స్ అన్నీ ఉపయోగించి ఆక్సిజన్…