కరోనా మహమ్మారి ఆట కట్టించేందుకు దేశంలో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతున్నది. ఇప్పటి వరకు దేశంలో 21 కోట్లమందికి వ్యాక్సిన్ అందించారు. మే నెలలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కోసం 7.9 కోట్ల డోసులను అందుబాటులో ఉంచగా, జూన్ నెలలో 12కోట్ల డోసులను అందుబాటులో ఉంచినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇందులో కేంద్రం 6.09 కోట్ల డోసులను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఉచితంగా సరఫరా చేయనుండగా, 5.86 కోట్ల డోసులు రాష్ట్రాలు, ప్రైవేట్ ఆసుపత్రులు సేకరించేందుకు…
భారత్‌లో క్రమంగా కరోనా పాజిటివ్ కేసులు దిగివస్తున్నాయి… కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,65,553 పాజిటివ్ కేసులు నమోదవగా.. 3,460 మంది కరోనాతో మృతి చెందారు. ఇదే సమయంలో 2,76,309 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,78,94,800 కు చేరుకోగా.. ఇప్పటి వరకు 3,25,972 మంది మరణించారు.. ఇక, రికవరీ కేసులు 2,54,54,320 కు పెరిగాయి. ప్రస్తుతం…
కరోనాకు చెక్ పెట్టేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. అయితే, భారత్‌లో వ్యాక్సినేషన్‌పై గందరగోళం కొనసాగుతూనే ఉంది.. దీనికి కారణం.. రాష్ట్రాల దగ్గర సరైన వ్యాక్సిన్ నిల్వలు లేకపోవడమే కారణం.. దీంతో.. క్రమంగా కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నాయి రాష్ట్రాలు.. వ్యాక్సిన్ల విషయంలో కేంద్రం పాలసీని తప్పుబడుతున్నారు. అయితే, ఇప్పటి వరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 22,77,62,450 వ్యాక్సిన్ డోసులు సరఫరా చేసినట్టు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ప్రకటించింది.. ఇవాళ ఉదయం 8 గంటల వరకు తమ దగ్గర…
భారత్‌లో క్రమంగా కరోనా పాజిటివ్ కేసులు దిగివస్తున్నాయి… కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 173,921 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. ఇది 46 రోజుల్లో అతి తక్కువ రోజువారీ కేసుల సంఖ్య, అయితే, రోజువారీ మరణాల సంఖ్య మూడువేలకు పైగానే నమోదు అవుతోంది.. తాజాగా మరో 3,563 మంది కరోనాతో మృతిచెందారు.. ఇదే సమయంలో 2,84,601 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం…
కరోనా సెకండ్ వేవ్ భారత్‌లో కల్లోలం సృష్టిస్తున్న సమయంలో.. ఇది భారత్ కోవిడ్ వేరియంట్ అంటూ కథనాలు వచ్చాయి.. చాలా మంది నేతలు విమర్శలు చేశారు.. అయితే, ఈ విమర్శలను బీజేపీ తప్పుబట్టింది.. అంతేకాదు.. అది భారత్ వేరియంట్ అంటూ ఉండే కంటెంట్ మొత్తం తొలగించాలంటూ.. అన్ని సోషల్ మీడియా సంస్థలను కోరింది. అయితే, ఈ వ్యవహారంపై స్పందించిన మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ గొప్ప దేశం కాదని,…
కరోనా కల్లోలం ప్రారంభమైనప్పట్టి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులపై భారత్ నిషేధం విధించింది.. భారత్ నిర్ణయం తీసుకుని దాదాపు 11 నెలలు అవుతుంది.. కరోనా ఫస్ట్ వేవ్ పోయి.. సెకండ్ వేవ్ ప్రారంభమైన నేపథ్యంలోనూ నిషేధం పొడిఇస్తూ వచ్చిన కేంద్రం.. తాజాగా, మరో 30 రోజులు ఆ నిషేధాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.. అంతర్జాతీయ కమర్షియల్, ప్యాసింజర్ విమానాలపై ఉన్న నిషేధాన్ని మరో నెలపాటు పొడిగిస్తున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకటించింది.. జూన్…
భారత్ లో రెండవ విడత “కరోనా” వైరస్ విజృంభణ కొనసాగుతున్నది. పాజిటివ్ కేసులు తగ్గినా.. “కరోనా” మరణాలు ఆగడం లేదు. దేశంలో గడచిన 24 గంటలలో 1,86,364 “కరోనా” పాజిటివ్ కేసులు నమోదు కాగా…3,660 మంది మృతి చెందారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2,59,459 కాగా…దేశంలో ఇప్పటివరకు నమోదయిన “కరోనా” పాజిటివ్ కేసుల సంఖ్య 2,75,55,457 కు చేరింది. ఇటు దేశ వ్యాప్తంగా ఉన్న యాక్టీవ్ కేసుల సంఖ్య…
కొత్త నిబంధనలు ఇప్పుడు భారత ప్రభుత్వం, ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ మధ్య వివాదానికి దారి తీశాయి.. ఇక, భావ ప్రకటనా స్వేచ్ఛకు ప్రమాదం వుందన్నట్విట్టర్ చేసిన వ్యాఖ్యలను మరింత దుమారాన్నే రేపుతున్నాయి.. దీనిపై కేంద్ర ఐటీశాఖ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.. ట్విట్టర్ వ్యాఖ్యలను ఖండించిన కేంద్రం.. ఇది, ట్విట్టర్ బెదిరింపు వ్యూహాలతో కూడిన నిరాధార ఆరోపణలుగా ఐటీ శాఖ వ్యాఖ్యానించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి.. ఇప్పుడు ట్విట్టర్ పాఠాలు నేర్పుతోందని ఫైర్ అయ్యింది…
అపరకుభేరుడు ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్… తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు వ్యాక్సిన్ ఇచ్చే విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.. తమ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులతో పాటు.. వారి కుటుంబ సభ్యులు అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టు ఈ కార్పొరేట్ దిగ్గజం నిర్ణయానికి వచ్చింది.. దీని కోసం ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించనుంది.. రిలయన్స్‌తో పాటు.. దాని అనుబంధ, భాగస్వామ్య సంస్థల్లో పనిచేస్తున్న 13 లక్షల మంది సిబ్బందికి…